Home తాజా వార్తలు పాముకాటుతో బాలుడి మృతి..!

పాముకాటుతో బాలుడి మృతి..!

Boy died with Snake Bite in Vizianagaram district

అమరావతి: పాముకాటుతో బాలుడు మృతి చెందిన విషాద సంఘటన ఎపిలోని విజయనగరం జిల్లా గణపతినగరం మండలం కొత్తబగ్గాం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గౌతమ్ అనే బాలుడు పాముకాటుతో మృత్యువాత పడ్డాడు. గౌతమ్ ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులకు గౌతమ్‌ ఒక్కడే కొడుకు. ఏకైక కుమారుడు ఇలా పాముకాటుకు గురై కళ్ల ముందు ప్రాణాలొదలడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కాగా, ఇటీవల ఎపిలో అధిక సంఖ్యలో పాముకాటు మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే.

Boy died with Snake Bite in Vizianagaram district, AP.