Home తాజా వార్తలు చెరువులో పడి బాలుడి మృతి…

చెరువులో పడి బాలుడి మృతి…

Boy dies after drowning in pond

పర్వతగిరి: పర్వతగిరి మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అన్నారం షరీఫ్ దర్గా చెరువు లో ప్రమాదవశాత్తు జారి పడి గుర్ర రోహిత్(6) అనే బాలుడు మృతి చెందాడు. అన్నారం గ్రామంలోని గుర్ర సంతోష్, రజిత దంపతుల పెద్ద కుమారుడైన రోహిత్ తన తోటి పిల్లలతో కలిసి దర్గా వద్దకు వచ్చి దర్గాను సందర్శించిన తరువాత చెరువును చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి బాలుడు మృతి చెందాడు.