Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం

Girlfriend's silence in front of the boyfriend's house

మనతెలంగాణ/సదాశివనగర్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఓ యువతి తనతో సహజీవనానికి ఒప్పుకున్న తర్వాత ఆ యువతి గర్భం దాల్చడంతో పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ఆ మహిళ మౌన పోరాటానికి దిగింది. వివరాలు ఇలా ఉన్నా యి. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన మంద మమత అనే యువతి సదాశివనగర్ ఆడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి అనే యువకుడు ప్రేమించుకున్నారు. కొంత కాలం తర్వాత యువతి గర్భం దాల్చడంతో ఆ యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని అతని ఇంటిముందు సోమవారం మమత మౌన పో రాటానికి దిగింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై గంగాధర్‌రావు, మహిళా సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆ యువతితో పోలీస్‌స్టేషన్‌లో పిటిషన్ వేయాలని కోరగా మమత కేసు పెట్టడానికి నిరాకరించింది. తనకు ఇక్కడే న్యాయం చేయాలని తెలిపింది. న్యాయం కొరకు ఉన్నతాధికారు ల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండాపోయిందని తను గర్బవతి అని తెలిసి బలవంతంగా అబార్షన్ మాత్రలు వేయించారని వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేసే వరకు ఇక్కడే ఉంటానని వివరించింది.

Comments

comments