Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

గర్భవతైన ప్రియురాలిని రైల్లోంచి తోసేసిన ప్రియుడు!

Woman-Harrasmentకోల్‌కతా : నగరంలోని మాల్దా రైల్వే స్టేషన్‌లో గత మంగళవారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గర్భవతైన తన ప్రియురాలిని రైలులోంచి తోసేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కతిహార్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం మాల్దా నుంచి శంసీ స్టేషన్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యంలో ప్రయాణికులకు ఓ మహిళ(36) ఆర్తనాదం వినిపించింది. దీంతో వారు అక్కడకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడిఉన్న మహిళ కనిపించింది. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు ఆమెను సమీపంలోని మాల్దా మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనలో బాధితురాలు కుడి చేయి కోల్పోయింది.

బాధితురాలి కుటుంబ సభ్యులు అహిమ్ మండల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గత కొంత కాలంగా తమ కుమార్తె అహిమ్‌తో ప్రేమలో ఉందని, అమె గర్భవతి అయిదనే విషయం తెలిసి అహిమ్ పెళ్లికి నిరాకరించాడని. పోలీసు కేసు పెడతామని బెదిరిస్తే పెళ్లికి అంగీకరించాడని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.

మంళవారం బాధితురాలిని అహిమ్ బయటకు తీసుకెళ్లాడని.. కాబట్టి ఈ దుర్ఘటనకు పాల్పడింది అతడే అని వారు తెలిపారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Comments

comments