Home హైదరాబాద్ తండ్రి వెళ్ళగొట్టాడని రోడ్డెక్కిన బాలుడు

తండ్రి వెళ్ళగొట్టాడని రోడ్డెక్కిన బాలుడు

చేరదీసి పోలీస్‌స్టేషన్‌కు చేర్చిన కానిస్టేబుల్

Boy

మనతెలంగాణ, చాంద్రాయణగుట్ట : తాగుబోతు తండ్రి ఇంట్లోంచి పంపివేయటంతో దిక్కుతోచని ఆ బాలుడు ఒంటరయ్యాడు. గుక్కపెట్టి ఏడుస్తూ బిక్క మొహంతో అమాయకపు చూపులు చూస్తున్నాడు. పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతున్నాయన్న పుకార్లు షికార్లు చేస్తున్న ప్రస్తుత సమయంలో అటుగా వచ్చిన ఒక పోలీసు కానిస్టేబుల్ ఆ బాలు డి తీరుతో అనుమానం వచ్చి చేర దీశాడు. వివరాల కోసం ప్రయత్నించగా బాలుడి పేరు తప్పా మరో మాట చెప్పలేదు. వివరాలలోకి వెళితే… అలియా బాద్ లక్ష్మీనగర్‌కు చెందిన పి.బాబురావు కుల్సు ంపురా పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తు న్నాడు. శనివారం మధ్యాహ్నం వేళ బడంగ్‌పేట్ లోని బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుండగా బాలా పూర్ చౌరస్తా నుంచి మిధానీ వైపు వస్తుండగా దారిలో ఒంటరిగా నిలబడి వెక్కివెక్కి ఏడుస్తున్న బాలుడు కనిపించాడు. అనుమానం వచ్చిన బాబు రావు ఆ బాలుడిని చేరదీశాడు. ఎందుకు ఏడు స్తున్నావు, నే పేరేంటి, మీ తల్లిదండ్రుల పేరేంటని ప్రశ్నించగా తన పేరు విజయ్ (9)ని తెలిపాడు. కాని తల్లిదండ్రుల పేర్లు చెప్పేందుకు సహసిం చలేదు. ఎంత బతిమిలాడినా చెప్పలేదు.

చివరకు తన తండ్రి మద్యం సేవించి అర్ధరాత్రి ఇంటికి వచ్చి తన తల్లిని బాగా కొడతాడని, తనను ఇంట్లోంచి వెళ్లిపొమ్మని వెళ్లగొట్టినట్లు గద్గద స్వరంతో చెప్పా డు. దీంతో చలించిపోయిన కానిస్టేబుల్ ఆకలితో ముఖం చెమ్మగిల్లిపోయిన బాలుడికి భోజనం చేయించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిం చాడు. అయినా ఆ బాలుడు చెప్పక పోవటంతో సమీపంలోని కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తీసు కువెళ్ళాడు. అక్కడ పోలీసులు సైతం బాలుడిని ప్రశ్నించినా వివరాలు సరిగా చెప్పలేదు. చివరకు కంచన్‌బాగ్ పోలీసులు పరిధి తమకు రాదని, మీర్‌పేట్ పోలీసుస్టేషన్‌కు వెళ్ళాలని సూచించారు. దీంతో బాబురావు ఆ బాలుడిని తీసుకొని మీర్‌పేట్ పోలీసుస్టేషన్‌కు వెళ్ళాడు. అక్కడ ఎస్సైతో వివరా లు చెప్పి విజయ్‌ను వారికి అప్పగించాడు. బాలుడి వివరాలు తెలిసిన వారు  94910 30065లో సంప్రదించాలని స్థానిక పోలీసులు కోరారు.