Home జాతీయ వార్తలు పిస్టల్ ఆట అక్క ప్రాణం తీసింది

పిస్టల్ ఆట అక్క ప్రాణం తీసింది

                         Gun-Fire-In-Party

భీండ్ : పిస్టల్‌తో పిల్లచేష్టలు చివరికి పదేళ్ల బాలిక ప్రాణాలు తీశాయి. మధ్య ప్రదేశ్‌లోని భీండ్ జిల్లాలో ధరమ్‌పురి ప్రాంతంలో ఓ ఇంట్లో ఎనిమి దేళ్ల బా లుడు ఇంట్లో ఉదయం వేళలో పరుపుపై ఉండి తండ్రి లైసెన్సుడు రివాల్వర్ చేతబుచ్చుకుని ఆటకు దిగాడు. పక్కనే ఉన్న పది సంవత్సరాల అక్కను బెది రిస్తున్నట్లుగా నటిస్తూ ఉండగా అనుకోకుండా చేతిలోని రివాల్వర్ పేలి ఆ బాలిక శరీరంలోకి తూటాలు దూసుకుపొయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆఫీసులో క్లర్క్‌గా ఉండే తండ్రి రివాల్వర్ చివరికి ఇంట్లో ప్రాణాంతకంగా మారింది. బాలిక అక్కడికక్కడే చనిపోయిందని, కేసు నమోదు చేసి ఘటనపై ద ర్యాప్తు జరుపుతున్నామని జిల్లా పోలీసు అధికారి రాజేంద్ర వర్మ తెలిపారు.