Home భద్రాద్రి కొత్తగూడెం బాలుడిని పొట్టనబెట్టుకున్న అక్రమ సంబంధం

బాలుడిని పొట్టనబెట్టుకున్న అక్రమ సంబంధం

Murder-with-Dating

భద్రాచలం : పట్టణంలోని అశోక్ నగర్ కొత్తకాలనీకి చెందిన వినయ్ శివసాయిరెడ్డి (11) అనే బాలుడు గోదావరిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆఖరికి ఆ బాలుని మృత దేహం చేపలు పట్టే తన సొంత తాత వలకే చిక్కింది. వివరాల ప్రకారం కాలనీలో చెందిన సత్యనారాయణ రెడ్డి – విజయ దంపతుల కుమారు శివసాయిరెడ్డి, కాగా బాలుని తండ్రి సత్యనారాయణ రెడ్డి పట్టణంలోని గీతాంజలి హోటల్లో పనిచేస్తూ గత రెండేళ్ల క్రితం డెంగీ జ్వరంతో మృతి చెందాడు. అయితే తల్లి శివసాయి రెడ్డితోపాటు తన సోదరిని సరిగా పట్టించుకోదనితెలుస్తోంది.

గత కొంతకాలంగా వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తున్న తాను పిల్లలను సరిగా ఇంట్లో కూడా ఉండనివ్వకుండా బయటే ఆడుకోవాలని వేదించేదని, తనతో సహజీవనం చేసే ఆటో డ్రైవర్ సతీష్ అనే వ్యక్తి పిల్లలు ఇంట్లోకివస్తే పెద్దగా కొట్టి బయటకు పంపేసేవాడని, ఆ దెబ్బలకు తాళలకే పిల్లలు ఇంట్లోకి వెళ్లేందుకు కూడా బయపడి చుట్టు ప్రక్కల వారి ఇళ్లలోనే తింటూ చీకటిపడే వరకు ఆడుకునే వారని అక్కడివారు చెబుతున్నారు. గత
రెండురోజుల క్రితం ఆటో డ్రైవర్ సతీష్ అనే వ్యక్తి ఈ బాలుని పీక గట్టిగా నొక్కి చంపేస్తానని బెదిరించినట్లు అనుమానాలువ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం నుండి బాలుడు కనిపించకుడా అదృశ్యం కావడంతో కాలనీ వారంతా ఆ బాలుని కోసం గాలింపు
చర్యలు చేపట్టారు. అందరి ఇళ్లతో తింటూ అందరితో కలివిడిగా ఉండే ఆ బాలుడు ఇంట్లో పడుతున్న బాధలు ఇరుగుపొరుగు వారికి సైతం తెలియడంతో అంతా ఆదరించేవారు. కాగా బాలుని ఆచూకి కోసం తల్లి, తనతో సహజీవనం చేస్తున్న సతీష్‌ను నిలదీసినప్పటికీ వారిపై కూడా
వీరిద్దరు తిరగబడి మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు.

రాత్రి వేళల్లో సైతం బస్టాండ్, సినిమా హాల్ సెంటర్, టెంపుల్ రోడ్ తదితర ప్రాంతాల్లో గాలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. మృతిని తాత సీతయ్య శుక్రవారం తెల్లవారు జామున చేపలు పట్టేందుకు గోదావరి నదికి వెళ్లి వల లాగుతున్న క్రమంలో ఆ వలకు చిక్కి బాలుని మృత దేహం
లభ్యమైంది. తన మనుమడి మృత దేహాన్నిచూసిన సీతయ్య బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు తల్లి, తనతో పాటు ఉంటున్న సతీష్‌లు వారికి అడ్డంకిగా ఉన్నాడని ఆ బాలున్ని కడతేర్చారని ఇరువురికీ దేహ శుద్ది చేసి సతీష్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసునమోదు చేసిన పోలీసులు మృతదేహాని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కాగా గోదావరి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెంది ఉంటే నీళ్లు మింగి ఉండాలని, ఆ బాలునికి చెందిన బట్టలు సైతం అక్కడ లేవని,ఇదే ముమ్మాటికీ హత్యే అంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.