Home వనపర్తి పల్లె జానపదాల సూర్యుడు.. బోయ గుడిసె శివలింగం

పల్లె జానపదాల సూర్యుడు.. బోయ గుడిసె శివలింగం

నేటి ఉరుకుల పరుగుల ప్రయాణంలో అంతరించి పోతున్న పల్లె జానపద పాటలకు , చెక్క భజన , కోలాటం, జొన్నసుద్దులు వంటి కళలను భావి తరానికి అందించేలా , యువతీ యువకులలో దాగి యున్న కళలను బయటికు తీస్తూ కళాకారులుగా తయారు చేస్తున్న బోయ గుడిసె శివలింగం మన తెలంగాణ” తో పంచుకున్న అనుభవాలు

Artist

వనపర్తి : గ్రామీణ ప్రాంతంలో జన్మించి , తల్లి బొడ్డమ్మ తండ్రి భజన పాటలతో ఆకర్షితుడై చిన్నతనం నుంచే పాటలు పాడడం పై మక్కువను పెంచుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ, పలు టివి కార్యక్రమాల్లో, ధూంధాం , కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వెన్నెల కళాసమాతి ద్వారా ఎంతో మం ది యువతీ యువకుల కళలను బయటకు తీసి కళాకారులుగా తీర్చిదిద్దడమే కా కుండా ఉత్తమ గాయకుడిగా మహాత్మజ్యోతి రావుపూలే అవార్డు ను కైవసం చేసు కోవడంతో పాటు 5వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన బోయగుడిసె శివలింగం.

అమ్మ బొడ్డ్డెమ్మ, నాన్న భజన, కోలాట పాటలే శివలింగానికి మార్గదర్శకం,పల్లె ప్రాంతం నుండి జాతీయ స్థాయి వరకు పాటల ప్రదర్శనలు ,వెన్నెల కళా సమితి సంస్థతో పలువురి కళాకారులకు ప్రోత్సాహం ,ఉత్తమ గాయకునిగా మహాత్మా జ్యోతీరావు పూలే అవార్డు గ్రహీత,40వ రాష్ట్ర మహాసభలు, 24 జాతీయ సభల్లో గాయకునిగా ప్రదర్శనలు, 5వేలకుపైగా ప్రదర్శనలు, లెక్కకుమించిన అవార్డు లు, ప్రశంసాపత్రాలు

కుటుంబ నేపథ్యం: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి చెందిన గుడిసే రాముడు , గుడిసే సత్యమ్మ దంపతులకు చెందిన కుమారుడు బోయ గుడిసె శివలింగం . వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్న కుటుంబంలో జన్మించిన శివలింగం . 1 నుండి 10 వ తరగతి వరకు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సింగోటం , రాణి ఇందిరా దేవి జూనియర్ కళాశాల కొల్లాపూర్ , డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి (బిఎ) మహబూబ్‌నగర్‌లో విద్యాభాసాన్ని పూర్తిచేశాడు.ప్రసుత్తం తెలంగాణ సాంస్కృ త్రిక సారథి సమాచార శాఖ వనపర్తి జిల్లా లో ప్రభుత్వ ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్నాడు .

పాటలు,కళల వైపు ఆసక్తి ఇలా:అమ్మ బొడ్డెమ్మ పాటలు , నాన్న భజన , కోలా ట పాటలకు ఆకర్షితుడై జానపదాల వైపు పరుగులు తీస్తూ , బుద్దుడు , మహా త్మ జ్యోతి రావు పూలే , అంబేడ్కర్ , భగత్ సింగ్ , గద్దర్ , వందేమాతరం శ్రీనివా స్ , గోరెటి వెంకన్న ,సుద్దాల అశోక్ తేజ , సుద్దాల భారతి , జంగిరెడ్డి వంటి వా రిని స్పూర్తిగా తీసుకొని గ్రామీణ ప్రాంతం నుండి జాతీయ స్థాయి వరకు అంచె లంచెలుగా ఎదిగాడు శివలింగం . చిన్నతనం నుంచే జానపదాల పాటల ను పాడడమే కాకుండా పాఠశాలలో , కళాశాలలో నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మొదటి బహుమతును కైవసం చేసుకున్నాడు . భారత కమ్యూ నిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలిలో 45 రోజుల పాటు శిక్షణ పొం ది జిల్లా , రాష్ట్ర , జాతీయ స్థాయిల్లో విద్యార్థి , యువజన , కార్మిక , కర్షక , మహిళా సదస్సుల్లో పలు ప్రదర్శనలను ఇచ్చాడు .

కళా ప్రదర్శనలు:ప్రభుత్వము నిర్వహించే మా లక్ష్మి పొదుపు, అక్షర కిరణం , సప్తస్వరాలు, వన సంరక్షణ, హరితహారం, బాల్య వివాహాల రద్దు , వరకట్న , మద్యపాన, గుట్కా నిషేదాలు,జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, మిషన్ భగీ రథ,కాకతీయ, ఆసరా, పల్స్‌పోలియో, ర్యాగింగ్ , ఎయిడ్స్ నివారణ , కుటుంబ నియంత్రణ, చేత పడులు, పరిసరాల పరిశుభ్రత , 108,104, వినియోగం , ఆరోగ్యశ్రీ వంటి తదితర అంశాలపై 1994 నుండి నేటి వరకు పలు ప్రభుత్వాల సమాచార పౌర సంబందాల శాఖ అనుసందానంగా పలు అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తమ ఆట, పాటల ద్వారా పలు ప్రదర్శనలను ఇవ్వ డం జరిగింది. వీటితో పాటు నెదర్లాండ్ వారి అనుబంధంతో బోర్‌వెల్స్ ,రైతు చై తన్య సదస్సులు , ఆరుతడి పంటల ఆవశ్యకత , సేంద్రీయ ఎరువుల వాడకం , భూగర్భ జలాల పరిరక్షణ గురించి కర్నూల్, అనంతపూర్ , కడప, చిత్తూర్ ,ప్ర కాశం , మహబూబ్‌నగర్ , నల్గొండ జిల్లా లల్లో పలు స్వచ్చంద సంస్థల ఆధ్య ర్వంలో కళా ప్రదర్శనలను ఇచ్చాడు

విద్యార్థి సంఘ నాయకుడిగా ఉంటూ ప్రదర్శనలు:

ఎఐఎస్‌ఎఫ్ విద్రార్థి సంఘంలో కళాశాల కార్యదర్శిగా , జిల్లా , రాష్ట్ర కమిటిలో పలు హోదాల్లో కొనసాగి విద్యార్థి ఉద్యమాలల్లో పాలు పంచుకొని గుంటూర్ లో జరిగిన 40 వ రాష్ట్ర మహాసభలు, హైదరాబాద్ లో జరిగిన 24 వ జాతీయ మ హాసభల్లో పాల్గొన్ని తెలంగాణ విద్యార్థి రాజకీయ శిబిరాలల్లో అనేక కార్యక్ర మాల్లో విద్యార్థులను చైతన్య పరిచాడు.

వెన్నెల కళా సమితి సంస్థతో పలువరి కళాకారులకు ప్రోత్సాహం:

పేద యువతీ , యువకులలో దాగియున్న కళలను బయటికి తీసేందుకు 1994 సంవత్సరంలో వెన్నెల కళా సమితి అనే సంస్థ ను ప్రారంభించి దాదాపు 100 కు పైగా కళాకారుల కళను సమాజానికి పరిచయం చేశాడు. సంస్థ ప్రారంభం నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంతాలల్లో నెలకొన్న అనేక రుగ్మతలను రూపుమా పేందుకు తమ యొక్క కళాప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యనాన్ని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. మా టివి లో నిర్వహించినా రేలారేరేలా దుమ్ము లేపు కార్యక్రమానికి శిక్షకుడిగా ఎంపికైనా బోయ గుడిసె శివలింగం , పాన్‌గల్ మండలం బండపల్లి గ్రామానికి చెందిన రోజారమణి, జొన్నలబగొడ తాండకు చెందిన ఉమ, ముష్టిపల్లి గ్రామానికి చెందిన కురుమూర్తి , పాన్‌గల్ చెందిన రజిత , రాయిన్ పల్లి కి చెందిన జగపతిబాబు తో పాటు పలువురిని పరిచయం చేయడంతో పాటు పలు టివి ఛానెళ్లు లల్లో ప్రదర్శనలు ఇచ్చాడు .

పలువురి చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా ప్రతాలు:

1. 1994 లో అక్షర కిరణం కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణయ్య చేతుల మీదుగా ప్రశంసాప్రతం
2. 2002 నేషనల్ యూత్ పెస్టివల్ ఇస్సార్ పట్టణం హరాయాన కేంద్ర మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఉత్తమ జానపద ప్రశంసాప్రతం
3. 2005 నెహ్రూయువ కేంద్ర సంఘటన్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ వడోదర గుజరాత్‌లో కేంద్ర మంత్రి స్వర్గీయ సునీల్‌దత్ చేతుల మీదుగా ప్రశంసాప్రతం
4. 2006 ఉగాది సంబురాలు మైసూర్ , కర్నాటక వారి ఆధ్యర్వంలో నిర్వహించిన కార్యక్రమంలో కర్నాటక తెలుగు సంఘం చేతుల మీదుగా ప్రశంసాప్రతం
5. 2007 తెలుగు వెలుగులు నోయిడా పట్టణం తెలుగు సంఘం చేతుల మీదుగా ప్రశంసాప్రతం
6. 2008 డిశంబర్ లో విశాఖ బాల తేజస్సు, జానపద సందడి మువ్వల సందడి ఆధ్యర్వంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం చేతుల మీదుగా ప్రశంసాప్రతం
7. 2016 నవంబర్ లో భారతీయ దళిత సాహిత్య అకాడమి ఆధ్యర్వంలో మహాత్మ జ్యోతి రావు పూలే అవార్డును సంస్థ జాతీయ అధ్యక్షుడు ఎస్‌పి సుమ నాక్షర్ చేతుల మీదుగా అందుకున్నాడు .వీటితో పాటు ఉమ్మడి జిల్లా ఉత్తమ గాయకుడిగా మంత్రి జూపల్లి చేతుల మీదుగా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపా ధ్యాక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతతుల మీదుగా పాటకు సత్కారం అవార్డు లతో పాటు మద్యప్రదేశ్ , కేరళా , తమిళనాడు , గోవా , న్యూడిల్లి , ఉత్తర ప్రదే శ్ వంటి రాష్ట్రాలల్లో పలు రాష్ట్ర , జాతీయ ప్రదర్శనలలో అవార్డులు , ప్రశం సాప్రతాలు , ప్రోత్సాహక బహుమతులను కైవసం చేసుకున్నాడు

బోయ గుడిసె శివలింగం మాటల్లో : పల్లెల్లో నేటికి మూఢ నమ్మకాలు , చేతబ డులు , మద్యపానం , నిరక్షరాస్యత , బాల్యవివాహాలు , వరకట్నం , రోడ్డు ప్ర మాదాలు , హెల్మెంట్ వాడకం, వంటి అంశాలపై ప్రజలకు నా వంతు భాద్యత గా చైతన్య పరచడంతో పాటు అనేక మంది కళాకారులు ప్రోత్సాహం ఇస్తే టివి, సినిమా ,రంగాలల్లో ప్రతిభను చాటి నటునిగా , గాయకునిగా కొనసాగాలన్నదే తన ఆశయమని బోయ గుడిసె శివలింగం తన మాటల్లో తెలిపారు.