Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాజకీయాల నేపథ్యంలో బోయపాటితో చిత్రం

Balaiah

బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ స్టార్ బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ కూడా మొదలైంది.  ప్రముఖ రచయిత ఎం.రత్నం ఈ సినిమా కథను రాసే పనిలో ఉన్నాడు. అయితే ఈ చిత్రంలోని చాలా భాగం రాజకీయాల  నేపథ్యంలో సాగుతుందని సమాచారం. సమాజంలోని కుళ్లును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్‌ఫుల్‌గా ఈ స్క్రిప్ట్ ఉంటుందట. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బాలయ్య పొలిటికల్ కెరీర్‌కు ఉపయోగపడే విధంగా ఈ సినిమాను రూపొందించాలని ఇప్పటినుంచే చిత్ర బృందం ప్రణాళికలను రూపొందిస్తోందట. ఇక బోయపాటి, బాలకృష్ణలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చే ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈసారి ఆ అంచనాలను ఈ ఇద్దరు అందుకుంటారో లేదో చూడాలి.

Comments

comments