Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పియురాలి గొంతు కోసిన ప్రియుడు

attackకల్వకుర్తి: మాట్లాడదామని ప్రియురాలి పిలిచిన ఓ ఉన్మాది యువతి గొంతు కోసి పరారైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరా ల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల పిల్లిగుండ తండాకు చెందిన రాజేశ్వరి(20), దాసర్లపల్లి తండా కు చెందిన నరేశ్ (22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం వీరిద్దరూ నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలుగు లపల్లి గేటు దగ్గరలోని గుట్లపైకి ఎక్కారు. వెళ్లిన కొద్దిసేపటికే నరేశ్ తన తో పాటు తెచ్చుకున్న కత్తితో రాజేశ్వరి గొంతు కోశాడు. ఆ సమయంలో ఆమె అరిచిన ఆరుపులు వినబడి అక్కడే ఉన్న పశువుల కాపరులు రావ డం గమనించిన నరేశ్ మళ్లీ కడుపులో పొడిచి అక్కడి నుంచి పారిపో యాడు. అపస్మారకస్థితిలో ఉన్న రాజేశ్వరిని చూసి స్థానికులు వంగూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీ సులు గాయపడిన యువతిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. రాజేశ్వరిపై జరిగిన దాడిని తెలుసుకున్న పిల్లిగుండు తండా ప్రజలు ఆగ్రహనికి గురయ్యారు. దాడికి బాధ్యులైన నరేశ్‌నాయక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Comments

comments