Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రేమోన్మాది ఘాతుకం

Girl-Died-with

నార్కట్ పల్లి: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి గురువారం ఉదయం చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలులో చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన బోదనపు శ్వేతను గత కొద్ది నెలల నుంచి అమ్మనబోలుకు చెందిన బొడిగె భరత్ వేధిస్తున్నాడు. జూన్ 30న యువతిని  అపహరించేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడింది. శ్వేతను హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ బాబు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానిక సిఐ ఏరుకొండ వెంకటయ్య తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments