Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వైజాగ్‌లో దారుణం..!

Boyfriend attack with Knife on Girlfriend in Vizag

అమరావతి: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలి గుండెల్లో కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక కనక మహాలక్ష్మీ నగర్‌లో నివాసముంటున్న అనూషకు ఇదే ప్రాంతానికి చెందిన సతీష్‌తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గుజరాత్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసిన సతీష్ గత కొంతకాలంగా జాబ్ వదిలేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అనూషపై ఒత్తిడి తెస్తున్నాడు సతీష్.

ఆమె మాత్రం నీకు ఇంకో ఉద్యోగం వచ్చి మంచిగా సెటిలైన తర్వాత చేసుకుందామని నచ్చచెబుతూ వస్తోంది. అయితే, శనివారం రాత్రి మరోసారి సతీస్ ఆమె వద్దకు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికి అనూష నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సతీష్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. అనూష గుండెల్లో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ప్రాణాలతో పోరాడుతున్న అనూషను చూసిన స్థానికులు వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ప్రియుడు సతీష్ కోసం గాలిస్తున్నారు.

Comments

comments