Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రియురాలు గొంతుకోసి… ప్రియుడు ఆత్మహత్య

Attack-with-Knife

చెన్నై: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలు గొంతుకోసి, ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని మదురై జిల్లాలో చోటుచేసుకుంది. ఆలంగనల్లూర్ వలంపై గ్రామానికి చెందిన రాజరాణి(23) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన విద్యార్థిని కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. రాజరాణి తనను వివాహం చేసుకోమని ప్రియురాలిని ఒత్తిడి చేయడంతో ఆమె చదువు ముగిసిన తరువాత వివాహం చేసు కుందామని చెప్పింది.

కాని రాజారాణికి వారి తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేయడంతో ప్రియురాలిని ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో విద్యార్థిని శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలోనే వేచివున్న రాజారాణి తనను పెళ్లి చేసుకోమని మరోసారి కోరాడు. ఆమె నిరాక రించడంతోపాటు ఆగ్రహానికి గురైన అతడు తనతోపాటు తెచ్చుకున్న చాకుతో ఆమె గొంతుకోశాడు. దాంతో బాధితురాలు కేకలు వేసింది. ఇది గమనించిన స్ధానికులు ఘటన స్థలం వద్ద గుమ్మిగుడారు.

దీంతో భయాందోళనకు గురైన రాజారాణి చాకుతో తన గొంతును కోసుకున్నాడు. స్ధానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకన్న పోలీసులు తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితురాలి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఘటనాస్థలిలోనే మృతిచెందిన రాజారాణి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments