Home యాదాద్రి భువనగిరి ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు

ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు

Man-attacked-with-knife-on-

మోత్కూరు: ప్రియురాలి గొంతు కోసి ఆ తర్వాత భయంతో తాను గొంతుకోసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండలో చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. అడ్డగూడూరు మండ లంకం చనపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల యాదగిరి అనే ఆర్‌ఎంపి కొంతకా లం మోత్కూరులోని పలు ప్రైవేటు ఆసపత్రుల్లో పనిచేశాడు. ఆ సమయంలో పనక బండ గ్రామానికి చెందిన గట్టు రూప అలియాస్ స్వరూపతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఇటీవల యాదగిరి తనను వివాహం చేసుకోవాలని రూపను అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం యాదగిరి మద్యం మత్తులో పనకబండలో ఉన్న రూపను కలిసాడు. ఆగ్రహంతో ఆపరేషన్ చేసే బ్లేడ్‌తో మెడ, గొంతుపై దాడి చేశాడు. అడ్డువచ్చిన రూప సోదరుడిపై దాడిచేశాడు. ఆ తర్వాత భయంతో తాను గొంతు కోసుకున్నాడు. స్థానికులు వెంటనే వీరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు పంపారు.