Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రియురాలిని కొట్టి చంపి.. పూడ్చి పెట్టాడు!

murder

యాదాద్రి భువనగిరి: ప్రియురాలిని ప్రియుడు అతి కిరాతకంగా కొట్టి చంపి పాతిపెట్టిన దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం భుజలాపురంలో చోటుచేసుకుంది. నరేష్, భార్గవి గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పెళ్లి పేరుతో భార్గవిని తన వ్యవసాయ బావి వద్దకు పిలిచాడు నరేష్. అనంతరం ఆమెను వ్యవసాయ బావి వద్దే కొట్టి చంపి పూడ్చి పెట్టాడు. అయితే మృతురాలి తండ్రి లక్ష్మయ్య మోత్కూరు పోలీస్ స్టేషన్‌లో తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా భార్గవిని చంపినట్లు అంగీకరించాడు. కాగా, నరేష్ రెండు రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. నరేష్ సమాచారంతో వ్యవసాయ బావి వద్ద భార్గవి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

Comments

comments