Home Default ప్రియురాలిని గొంతుకోసి చంపేసి…

ప్రియురాలిని గొంతుకోసి చంపేసి…

Crime

న్యూఢిల్లీ: ప్రియురాలిని గొంతుకోసి చంపేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడో యువకుడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్రాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానికంగా నివాసముండే బెంగాల్ కు చెందిన 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఆమెకు 26 ఏళ్ల అవిషేక్ మండల్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రియురాలితో వివాదంలో మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన అవిషేక్ మండల్ ప్రియురాలిని గొంతు కోసి చంపేశాడు. అనంతరం తాను గదిలోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Boyfriend killed Girlfriend then Commits Suicide in Delhi

Telangana Breaking News