Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గర్భవతైన ప్రేయసిని కడతేర్చిన ప్రియుడు

Murder

అమరావతి: ఎపిలోని కర్నూలు జిల్లా డోన్‌లో ఓ మహిళ ఆమె ప్రియుడి చేతిలో దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొండపేటకు చెందిన రమిజ అనే వివాహిత భర్త చనిపోవడంతో ఆరేళ్ల కుమారుడితో ఉంటోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే సిద్ధుతో రమిజకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రమిజ గర్భం దాల్చింది. దాంతో తనను పెళ్లి చేసుకోవాలని సిద్ధుపై రమిజ ఒత్తిడి తేచ్చింది. రమిజ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో భయపడిన సిద్ధు ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 20న నంద్యాలకు వెళ్లి అక్కడ కాపురం పెడదామని రమిజను నమ్మించి బేతంచర్ల బస్సు ఎక్కించాడు.

డోన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బస్సు దింపాడు. సమీపంలోని అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లి ఆమె గొంతును తాడుతో బిగించి హతమార్చాడు. అనంతరం శవాన్ని అక్కడే పూడ్చి పెట్టాడు. దీంతో రమిజ తల్లి లక్ష్మీదేవి గత నెల 27న డోన్ పిఎస్‌లో తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సిద్ధును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడైన సిద్ధును పోలీసులు ఆదివారం ఘటనాస్థలికి తీసుకెళ్లి రమిజ మృతదేహాన్ని వెలికితీశారు. సిద్ధుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Boyfriend killed Pregnant Girlfriend in AP.

Comments

comments