Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రియురాలిని తుపాకీతో కాల్చి.. ఆపై ఆత్మహత్య

Gun-Fire-In-Party

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రియురాలిని తుపాకీతో కాల్చి.. ఆపై తాను అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో ప్రేమోన్మాది. న్యూఢిల్లీలోని ముఖర్జీనగర్ కార్పొరేషన్ పార్కులో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పార్కుకు వచ్చిన ఆ జంట గొడవపడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తనతోపాటు తెచ్చుకున్న తుపాకీతో ప్రియురాలిపై కాల్పులకు తెగపడ్డాడు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరించారు. ప్రేయసిపై కాల్పుల అనంతరం అతడు అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments