Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రియురాలిని నదిలో తోసేసిన ప్రియుడు

Aliveni

యానాం: వాళ్లిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దాంతో ప్రేయసి.. ప్రియుడిని పెళ్లి చేసుకుందామని అడిగింది. అంతే అప్పటి వరకు మధురమైన మాటలతో మురిపించిన అతగాడు ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయాడు. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. ఈ దారుణ ఘటన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అలివేణి(26), ఇదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. శ్రీనివాస్ స్థానికంగా ఉండే బట్టల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అలివేణి గత కొంతకాలంగా పెళ్లి చేసుకుమని శ్రీనివాస్‌పై ఒత్తిడి చేస్తోంది. దీంతో పెళ్లి విషయమై వీరి మధ్య గత కొన్నిరోజులుగా గొడవ జరుగుతోంది.

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అలివేణిని శ్రీనివాస్ యానాం తీసుకువచ్చాడు. వారు యానాం-ఎదుర్లంక జిఎంసి బాలయోగి వారధిపై కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య మళ్లీ పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో వారిద్దరీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ ఆమెను తలపై గాయపరిచి, గొంతు నులిమి గోదావరి నదిలోకి తోసేశాడు.

అనంతరం ఆమె మొబైల్, హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, అలివేణి నదిలో పడడం చూసిన కొందరు మత్స్యకారులు ఆమెను రక్షించారు. ప్రస్తుతం అలివేణి యానాం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.

Comments

comments