Home జాతీయ వార్తలు ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన ప్రియుడు

ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన ప్రియుడు

Girlfriend's-Homeబెంగళూరు: నగరంలోని శ్రీరాంపూరలో శనివారం దారుణం జరిగింది. ప్రేంచిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిదని ఓ దుర్మార్గుడు ప్రేయసి కుటంబాన్ని ఇంట్లో పెట్టి నిప్పంటించాడు. పోలీసుల కథనం ప్రకారం… బెంగళూరులోని శ్రీరాంపుర పరిధిలో గల సాయిబాబా నగర్‌కు చెందిన 22 ఏళ్ల దీపక్, తోటి విద్యార్థిని మేఘన(21) గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు వివాహం చేయడానికి ఒప్పుకున్నారు. అయితే దీపక్ గత నెల రోజుల నుంచి కాలేజ్‌కి వెళ్ళడం మానేశాడు. తనకు వెంటనే మేఘనతో పెళ్లి జరిపించాలని కోరాడు. దాంతో తల్లిదండ్రులు ముందు ఇంజనీరింగ్ పూర్తవ్వని తర్వాత చేస్తామని చెప్పారు. మేఘన కూడా ఇదే విషయం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ దీపక్ ప్రవర్తనలో మార్పు రాలేదు. జులాయిగా తిరుగుతూ ఇంట్లో విచక్షణరహితంగా ప్రవర్తిస్తుండటంతో వారం రోజుల క్రితం తల్లిదండ్రులు అతనిని ఎల్లహంక అనే ప్రాంతానికి పంపించారు. ఈ క్రమంలో దీపక్, మేఘనకు చాలా సార్లు ఫోన్ చేశాడు. కానీ మేఘన అతనితో మాట్లాడలేదు. దాంతో మేఘనపై కోపంతో శనివారం రాత్రి శ్రీరాంపురకు దీపక్ తిరిగి వచ్చాడు. సుమారు రాత్రి 12.30 గంటల ప్రాంతంలో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చి మేఘన ఇంటిపై పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో మేఘనతోపాటు ఆమె సోదరి సంజన(16), తల్లిదండ్రులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో మేఘన, సంజనలు 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె పేరెంట్స్‌కి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 307, 436 సెక్షణ్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.