Home జాతీయ వార్తలు ప్రియురాలిని కాల్చి చంపి …

ప్రియురాలిని కాల్చి చంపి …

Boyfriend Suicide After Kills Lover

చెన్నయ్ : ప్రియురాలిని కాల్చి చంపిన ఓ ప్రియుడు ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చెన్నయ్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. విల్లుపురం జిల్లా అన్నియూర్ కరుణానిధినగర్‌కు చెందిన శేఖర్ అనే పోలీసు, సరస్వతి అనే మెడికోకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వీరు అప్పుడప్పుడు తగాదా పడేవారు. బుధవారం రాత్రి సరస్వతి పుట్టిన రోజు కావడంతో ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటలకు సరస్వతి కేక్ కట్ చేశారు. విందు అనంతరం బంధువులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సరస్వతి తల్లిదండ్రులు ఇంట్లో టివి చూస్తున్నారు. సరస్వతి, శేఖర్ ఓ బెడ్ రూంలోకి వెళ్లి తగవు పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన శేఖర్ తన సర్వీస్ రివాల్వర్‌తో సరస్వతిని కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఒక్క కూతురు చనిపోవడంతో సరస్వతి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తాను చదివే మెడికల్ కాలేజీలో తోటి విద్యార్థితో సరస్వతి చనువుగా ఉంటుందన్న అనుమానంతో శేఖర్ ఆమెను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Boyfriend  Suicide After Kills Lover