Home రాష్ట్ర వార్తలు ఎంసెట్ టాపర్లు బాలురే

ఎంసెట్ టాపర్లు బాలురే

మొదటి నాలుగు ర్యాంకులు హైదరాబాద్‌కే

emcet-toppersహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన నిర్వహించిన ఎంసెట్-1 పరీక్ష ర్యాంకుల్లో బాలురు ప్రథమ స్థానంలో నిలిచారు. మొదటి పది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆరుగురు ఉండగా, మిగతా నలు గురు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన వారు ఉన్నారు. ఈ ర్యాం కుల ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశా రు. మొత్తం 2, 46,540 మంది విద్యార్థులు ఈ  పరీక్షలను పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో 1,44,511 మంది ఇంజి నీరింగ్ విభాగంలోనూ , అలాగే   1,02,029 మంది అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,33,428 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 90,114 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, ఇంజ నీరింగ్‌లో 77.88 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 83.98 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు డిప్యూటి సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఎంసెట్ -1ను జెఎ న్‌టియూ పకడ్బందీగా నిర్వహించిందని ఇలా పరీక్షలను నిర్వహించడం ఆ యూనివర్సిటికీ ఇది 19వ సారి కావడం అభినందనీయమన్నారు. ఎంసెట్ -2 పరీ క్షపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ .. అవి కూడా ఈ లోగానే నిర్వహించి 6 జూన్‌కు ర్యాంక్ కార్డులు విడుదల చేసేలా చూస్తామన్నారు. అనంతరం ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ప్రకటించి ఆగస్టు ఒకటో తేదీ నుండి తరగతలు ప్రారంభం అయ్యేలా షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు.
ఎంసెట్-1 టాపర్లు వీరే…
మొదటి ర్యాంక్: తల్లూరి సాయి తేజ( హాల్ టికెట్ నెం 1502167 ) కూకట్ పల్లి (హైదరాబాద్ ) మార్కులు 150కి 150
రెండో ర్యాంక్: దిగుమర్తి చేతన్ సాయి( హాల్ టికెట్ నెం 1511806) మాదాపూర్ ( హైదరాబాద్) పొందిన మార్కులు 159
మూడో ర్యాంక్:గుండా నిఖిల్ సామ్రాట్ (హాల్ టికెట్ నెం 1509145) మాదా పూర్ ( హైదరాబాద్ ) పొందిన మార్కులు 158, ర్యాంక్ కొండా విగ్నేష్ రెడ్డి (హాల్ టికెట్ నెం 1512323) మాదాపూర్ ( హైదరాబాద్ ) పొందిన మా ర్కులు 158, ర్యాంక్ చుండూరు రాహుల్ ( హాల్ టికెట్ నెం 3215237) గుంటూరు- పొందిన మార్కులు 158, ర్యాంక్ బండారు వెంకట సాయి గణేష్ ( హాల్ టికెట్ నెం 3212028) గుంటూరు – పొందిన మార్కులు 157. ర్యాంక్ కొండేటి తన్మయీ ( హాల్ టికెట్ నెం 1202873) విజయనగరం- పొందిన మార్కులు 157 ర్యాంక్, గంటా గౌతమ్ ( హాల్ టికెట్ నెం..3218094) పశ్చిమ గోదావరి జిల్లా పొందిన మార్కులు 157, ర్యాంక్ నంబూరు జయకృష్ణ సాయి వినయ్ ( హాల్ టికెట్ నెం 3207324) గుం టూరు పొందిన మార్కులు 157, ర్యాంక్ సట్టి వంశీకృష్ణా రెడ్డి ( హాల్ టికెట్ నెం 3405299) విశాఖపట్టణం- పొందిన మార్కులు 157
అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ టాపర్లు వీరే
మొదటి ర్యాంక్: బొజ్జ ప్రదీప్ రెడ్డి ( హాల్ టికెట్ నెం 6216195) కడప పొందిన మార్కులు 160,రెండో ర్యాంక్ సొమల ప్రత్యూష ( హాల్ టికెట్ నెం 42014 88) నల్కొండ పొందిన మార్కులు 160, ర్యాంక్ మహ్మద్ అర్బాజ్ ( హా ల్ టికెట్ నెం 6216061) కృష్ణా జిల్లా పొందిన మార్కులు 160, ర్యాంక్ బి. ప్రణతి ( హాల్ టికెట్ నెం 4705416) రంగారెడ్డి జిల్లా పొందిన మార్కులు 160 , ర్యాంక్ అమ్మకోల యజ్ఞప్రియ ( హాల్ టికెట్ నెం 4606146) సైదా బాద్, హైదరాబాద్ పొందిన మార్కులు 160, ర్యాంక్ జిషన్ అహ్మద్ జలీ లీ ( హాల్ టికెట్ నెం 4803467) బహదూర్‌పుర హైదరాబాద్ పొందిన మార్కు లు 159, ర్యాంక్ రాజుపాలెం ఉజ్వల్ ( హాల్ టికెట్ నెం 4201705) రంగారెడ్డి పొందిన మార్కులు 159, ర్యాంక్ తంగెడ కౌశిక్ ( హాల్ టికెట్ నెం 6601493) వరంగల్ పొందిన మార్కులు 159, ర్యాంక్ పెడిరెడ్ల శైలజ ( హాల్ టికెట్ నెం 6402351) విశాఖపట్టణం పొందిన మార్కులు 159, ర్యాంక్ అప్పల శ్రీనిధి ( హాల్ టికెట్ నెం 4607485) నల్గొండ పొందిన మార్కులు 159