Home మహబూబ్‌నగర్ మరికల్‌లో వెలసిన ‘ బ్రహ్మ కమలం ’

మరికల్‌లో వెలసిన ‘ బ్రహ్మ కమలం ’

Bramha-Kamalam

నవాబ్‌పేట :  మండల పరిధిలోని మరికల్ గ్రామంలో చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం పుష్పాలు వెలిశాయి. కాగా మరికల్ గ్రామాని కి చెందిన నర్సింహ్మారావు అనే వ్యక్తి తన ఇంటి ఆవ రణలో వివిధ రకాల గులాబీ ఇతర మొక్కలను పెంచ గా అందులో ఒక చెట్టుకు పూసిన పూలు రాత్రి 9 గం టల సమయంలో వికసించి గంటలోపే మళ్లీ మొగ్గగా మారడంతో యాజమాని ఆశ్చర్యానికి గురై  గ్రామం లో ఉన్న బ్రాహ్మణ వేద పండితులతో వాకబు చేయగా పురాణాల కాలంలో బ్రహ్మదేవున్ని ప్రసన్నం చేసు కోడం కోసం రుషులు అహర్నిశలు తపసు చేయగా వారి చుట్టూ ఇలాంటి బ్రహ్మపుష్పాలు వెలసేవసి  రాత్రి సమయాల్లో కొంది సేపు వికసించి సువాసన వె దజల్లేవని, అవి హిమాలయాల్లో అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం పుష్పాలని తెలిసింది. పుష్పాల లక్షణా లు తెలియడంతో విషయం తెలుసుకున్న ప్రజలు మరి కల్‌కు బయలుదేరి పూలను ఆశ్చర్యంగా తిలకిస్తున్నా రు. పూలు వికసించిన సమయంలో పూల సువాసన చుట్టు పక్కల ప్రాంతమంతా వ్యాపించడంతో ఆ పూల కున్న ప్రత్యేకతను స్థానికులు గుర్తించి ఆనోటా ఈనో ట పాకి మండల కేంద్రానికి చేరడంతో సంతకు వచ్చి న జనాలు ఆసక్తితో బ్రహ్మ కమలాలను వీక్షిస్తున్నారు.