Home ఆఫ్ బీట్ అంబర్‌పేటలో వికసించిన బ్రహ్మకమలం పుష్పాలు

అంబర్‌పేటలో వికసించిన బ్రహ్మకమలం పుష్పాలు

                  Brahma-Lotus-Flower

సిటీబ్యూరో: అంబర్‌పేట్‌లోని ఓ ఇంట్లో బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. స్ధానిక తిరుమల నగర్‌ కాలనీకి చెందిన ప్రముఖ విప్లవ కవి దివంగత జ్వాలాముఖి కుమారుడు డ్యాన్స్ మాస్టర్ మువ్వ శ్రీధర్, ఆర్తీ దంపతుల ఇంట్లో నాలుగు బ్రహ్మకమలం మొక్కలు ఉన్నాయి. గత మూ డేళ్లుగా ఏడాదికి మూడు రోజుల పాటు మొక్కల నుంచి  బ్రహ్మ కమలాలను వికసిస్తున్నాయి. గత రెండు రోజులు రాత్రి వేళల్లో ఈ పుష్షాలు వికసిస్తున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న స్ధానిక మహిళలు పెద్ద సంఖ్యలో  పుష్పాలు చూడటానికి శ్రీధర్, ఆర్తీ దంపతుల ఇంటికి తరలివస్తున్నారు.  పుష్పాలకు పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్తీ మాట్లాడుతూ పక్షుల రెట్ట ద్వారా ఈ మొక్కలు తమ ఇంట్లోని కుండీల్లోకి  చేరినట్లు తెలిపారు. ఈ మొక్కలను తాము అపురూపంగా చూసు కుంటున్నామని తెలిపారు.  ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ మొక్కలు పుష్పాలను వికసి స్తున్నాయని, ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.