Search
Wednesday 26 September 2018
  • :
  • :

వాయుసేన పొదిలో మహాస్త్రం

బ్రహ్మోస్ క్షిపణి సక్సెస్

Missileన్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్  బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. దీనితో భారత రక్షణ రంగం ప్రత్యేకించి వాయుసేన మరింత శక్తివంతమై, అరివీర భయంకరం కానుంది. భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 3౦ ఎంకెఐ విమానం నుంచి దీనిని బుధవారం తొలిసారిగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపిం ది. రెండు దశలలో ఈ క్షిపణిని ప్రయోగించా రు. ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ రెండు దశలలో బంగాళాఖాతంలోని లక్షాన్ని దెబ్బతీసిందని అధికార వర్గాలు తెలిపాయి. రెండున్నర టన్నుల బరువుండే ఈ క్షిపణిని భూమి, ఆకాశం, సము ద్రం నుంచి ఎక్కడినుంచైనా ప్రయోగించచ్చు. ఇక 29౦ కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్షాలను ఛేదించగలదని శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రజ్ఞుల బృందాన్ని అభినందించారు. ఇప్పటికే భూమి, యుద్ధనౌకల నుంచి ప్రయోగిం చి సాయుధ బలగాలకు అందుబాటులో  ఉన్న బ్రహ్మోస్ ఇప్పుడు వాయు దళ విమానం నుంచి జరిపిన పరీక్షలో విజయవంతంగా లక్షాన్ని ఛేదించింది. ఇప్పుడున్న వాయుదళ శక్తిసామర్థాన్ని మరింతగా పెంచుతూ , ప్రపంచంలోనే అతివేగంగా ప్రయాణించే క్రూయిజ్ మిస్సైల్‌గా పుటలోకి చేరుకుందని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) వారు ఈ చారిత్రక విజయం సాధించినందుకు వారిని అభినందిస్తున్నట్లు రక్షణ మంత్రి తమ హర్షం వ్యక్తికరించారు. సుఖోయ్ విమానం నుంచి రెండున్నర టన్నుల అతి బరువైన బ్రహ్మోస్ ఎఎల్‌సిఎంలోని రెండు దశల ఇంజిన్‌ను మండించగానే అది నిర్ణీత లక్షం వైపు దూసుకుపోయి పరీక్షలో విజయవంతం అయిందని ప్రకటనలో తెలిపారు. భారత్‌కు చెందిన డిఆర్‌డిఒ, రష్యాకు చెందిన ఎన్‌పిఒ మషినోస్ట్రోయినియా సంయుక్త నిర్మాణంలో ఈ క్షిపణి రూపుదిద్దుకుంది. శాస్త్రజ్ఞుల బృందాన్ని డిఆర్‌డిఒ ఛైర్మన్ డాక్టర్ ఎస్ క్రిస్టోఫర్ అభినందించారు.ఇది అద్భుతమైన విజయం అన్నారు. క్షిపణి పరీక్షను బ్రహ్మోస్ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్  డాక్టర్ సుధీర్ మిశ్రా , సీనియర్ వైమానిక దళాధికారులు, డిఆర్‌డిఒ, బ్రహ్మోస్ అధికారులు తిలకించారు.

Comments

comments