Home మహబూబ్‌నగర్ మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరపాలి

మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరపాలి

బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను, స్వామి వారి చరిత్ర బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్

Devisriprasad

మహబూబ్‌నగర్ : మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 6 నుంచి 16 వరకు  అత్యంత వైభ వంగా జరగనన్నాయని ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మ న్యంకొండ దేవస్థానంలో బ్రహ్మోత్సవాల బుక్‌లెట్, వాల్ పోస్టర్‌లను ఆవి ష్కరించి మాట్లాడారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని అన్ని ఏర్పాట్లతో అభివృద్ధి చేస్తు న్నామని, ఆలయం చుట్టూ కోటి రూపాయలతో  ఔటర్ రింగ్‌రోడ్డును ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు.

 ప్రతి శనివారం  కళ్యాణాలు జరుగుతాయని వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్రహోత్స వాలకు వచ్చే భక్తులు అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎ.నారాయణస్వామి, ఇఒ పి. వెంకటాచారి, ఓబ్లాయిపల్లి గ్రామ సర్పం చ్ రామకృష్ణమ్మ, ఎంపిపి సావిత్రి, మండల ప్రాదేశిక సభ్యురాలు చం ద్రకళ, జడ్పిటిసి శ్రీదేవిలు పాల్గొన్నారు.