Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బ్రెయిన్‌డెడ్ యువకుడి అవయవ దానం

Brain-Dead-Man

మనతెలంగాణ/శేరిలింగంపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందు తూ బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలు జీవన్ ధన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు దానం చేశాడు. వివరాల్లోకి వెళితే శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నెహ్రూనగర్‌కు చెందిన యువకుడు వేముల కుమార్ (21) బీఎస్సీ వరకు చదవుకొని డ్రైవర్‌గా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని మైసిగండి దేవాలయానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. గత మూడు రోజుల నుంచి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు వేముల కుమార్ అవయవాలు దానం చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు జీవన్ ధన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు అందజేశారు. అతనికి ఒక అక్క, తమ్ముడు ఉన్నారు.

Comments

comments