Search
Wednesday 26 September 2018
  • :
  • :

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

NSE

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలను నమోదు చేసింది. ఎట్టకేలకు నాలుగు రోజుల నష్టాలకు తెరపడింది. ఐటి, బ్యాం కింగ్ రంగాల షేర్ల అండతో ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఆ లాభాలను నిలబెట్టుకోలేకపోయా యి. మదుపర్లు అప్రమత్తత పాటించడంతో ఆద్యం తం ఊగిసలాటకు గురైన సూచీలు ఆఖరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సోమవారం బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో 32,869 ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10,127 వద్ద స్థిరపడింది. సానుకూల దేశీయ పరిణాలతో దేశీ స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గత వారంలో సూచీల భారీగా నష్టపోవడం, నేటి నుంచి ఆర్‌బిఐ పరపతి సమావేశాలు ప్రారంభం అవుతుండంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. సెన్సెక్స్ సూచీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చెందిన షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు టెలికాం రంగానికి చెందిన షేర్లు 1శాతానికి పైగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలోని మరో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్‌లో భారీగా 116 పాయింట్లు నష్టపోయి చివరకు 25,075 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటి 1శాతానికి పైగా లాభపడగా, నిఫ్టీ ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్ సూచీ అత్యధికంగా 0.60 శాతం నష్టపోయింది. ఇండియాబుల్స్ హౌసింగ్స్ ఫైనాన్స్, ఇన్పోసిన్, హెచ్‌సిఎల్ టెక్, గెయిల్, హిందాల్కో లాభపడ్డాయి. ఇన్ప్రాటెల్, యుపిఎల్, కోల్‌ఇండియా, బ జాబ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ 2 శాతం వరకు నష్టపోయాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ద్రవ్యపరపతి విధాన సమీక్ష రెండు రోజులపాటు జరుగనుంది. మంగళవారం సమావేశం మొదలై బుధవారం 6న ముగియనుంది. బుధవారం మధ్యాహ్నం పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి.
ఆర్‌కామ్ షేరు మరింత డీలా..
రిలయన్స్ కమ్యూనికేషన్ షేరు రోజు రోజుకీ మరింతగా పతనమవుతోంది. ఐఎఫ్‌సిఐ సంస్థ రిలయన్స్ నావల్‌పై ఎన్‌సిఎల్‌టికి ఫిర్యాదు చేయడంతో మార్కెట్‌లో కంపెనీ షేరు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ట్రేడింగ్‌లో షేరు విలువ ఏడాది కనిష్ఠానికి పతనమైంది. సోమవారం ట్రేడింగ్‌లో 8 శాతం క్షీణించి రూ.11.40కు తగ్గింది. చివరకు ఆర్‌కామ్ షేరు గత ముగింపు ధరతో పోలిస్తే 6.07 శాతం నష్టంతో రూ.11.60ల వద్ద ముగిసింది. కాగా షేరు ఏడాది, కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.9.60లు, రూ.12.45లుగా ఉన్నాయి.

Comments

comments