Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మూడు రోజుల నష్టాలకు బ్రేక్

bzms

* ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్‌ల లాభాల మద్దతు
* 346 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబయి: వరుసగా మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బ్యాంకులు, ఐటీ స్టాక్స్‌లో లాభాలు మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. మంగళవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకూ అదే జోరును చూపాయి. సెన్సెక్స్ 340 పాయింట్ల పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 96 పాయింట్లు పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ జోరందుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 346.38 పాయింట్లు లాభపడి 33,106.82 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 96.70 పాయింట్లు లాభంతో 10,214.75 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇలో ఇన్ఫోసిస్ షేర్లు 4 శాతం లాభాలను నమోదు చేశాయి. బజాజ్ ఫైనాన్స్ 3.73 శాతం, ఎస్‌బిఐ 2.77 శాతం, అరబిందో ఫార్మా 2.54 శాతం, రిలయన్స్ 2.44 శాతం మేరకు లాభపడ్డాయి. మరోవైపు కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, బిపిసిఎల్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ పిఎస్‌యూ బ్యాంక్ సూచి అత్యధికంగా 125 పాయింట్లు (3.22 శాతం) లాభపడింది. కీలకమైన నిఫ్టీ బ్యాంక్ సూచి 227 పాయింట్లు (0.90శాతం) లాభపడి 25,446 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ రంగాల వారీ సూచీల్లో బిఎస్‌ఇ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సూచీ అత్యధికంగా 2.36 శాతం లాభపడింది. ప్రధాన సూచీలైన టెలికాం, రియాల్టీ, విద్యుత్, కన్యూజమర్ గూడ్స్ సహా అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిసాయి. ఇన్పోసిస్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని వ్యస్థాపకులు నారాయణ ప్రకటనతో ఆ కంపెనీ షేరు 4శాతం ర్యాలీ చేసింది. జజాజ్ ఫైనాన్స్ 3.73 శాతం, మరోవైపు 11 నిరర్థక ఖాతాలకు సంబంధించిన ఆస్తులను విక్రయించనున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఎస్‌బిఐ షేరు 3 శాతం పెరిగింది. రూపాయితో మారకం విలువ 65.22 వద్ద కొనసాగుతోంది.

Comments

comments