Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మిషన్ కాకతీయకు బ్రేక్

Mishan-kakathiya-image

నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారుల ఆదేశాలు
వర్షాల కారణంగా చెరువుల పనుల నిలిపివేత
నత్తనడకన సాగుతున్న నాలుగు విడతల పనులు
రూ. 894 కోట్లతో 481 చెరువుల పునరుద్దరణ
పనుల్లో అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక
కమీషన్‌లతో పనులవైపు కన్నెత్తి చూడని అధికారులు

మన తెలంగాణ/మంచిర్యాల : దశాబ్దాల కాలంగా మరమ్మతులకు నోచుకోని చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద కోట్లాది రూపాయలు విడుదల చేయగా అధికారుల నిర్లక్షం కాంట్రాక్టర్ల దనదాహం కారణంగా ఆశించిన మేరకు లక్షాలు కనిపించడం లేదు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చెరువుల పునరుద్దరణ పనులనునిలిపివేశారు. జిల్లాలో నాలుగు విడతల కింద రూ.894 కోట్లతో 481 చెరువుల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల చెరువులు నీటి తో నిండిపోయి. పనులు చేయడానికి ఆ టంకాలు ఏర్పడుతుండగా మరికొన్ని గ్రామాల్లో అధికారుల నిర్లక్షం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో చెరువుల పునరుద్దరణ పనులకు లక్షలాది రూపాయలు వెచ్చించినప్పటికీ ఆయకట్టుకు చుక్కనీరు కూడా అందని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో జరిగిన చెరువుల పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, కాగ్ నివేదిక వెల్లడించినప్పటికీ అధికారుల్లో కదలికలు రావడం లేదు. జిల్లాలో మొదటి విడుత కింద 147 చెరువుల పునరుద్దరణకు 3.71 కోట్లు కేటాయించగా 147 చెరువుల పనులు పూర్తయినట్లుగా అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. రెండవ విడత కితం 155 చెరువులకు గాను 4.83 కోట్లు కేటాయించగా 95 చెరువుల పనులు పూర్తయ్యాయి. మూడవ విడత కింత 113 చెరువుల పనుగాను 3.38 కోట్లు కేటాయించగా 103 చెరువుల మరమ్మతులు పూర్తయ్యాయి. అతే విధంగా నాల్గొవ విడత కింద 61 చెరువులకు గాను కేవలం ఆరు మాత్రమే పూర్తి చేయగా 55 చెరువులు పెండింగ్‌లో ఉన్నాయి. మిషన్ కాకతీయ కార్యక్రమం కింద దాదాపు 38 వేల ఎకరాల ఆయ కట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకోగా చెరువుల కింద ఆయ కట్టుకు చుక్క అందని పరిస్థితులు నెలకొన్నాయి. జైపూర్ మండలంలోని మిట్టపల్లి, సాయికుంట మొదటి విడతలో రూ. 16 లక్షలను కేటాయించారు. ఆనకట్ట నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతో ఒక ఎకరానికి కూడా నీరు అందడం లేదు. అదే విధంగా ముదిగుంట ఊర చెరువు కింద 80ఎకరాల ఆయ కట్టు ఉండగా తూము, పూడిక తీత పనులకుగాను రూ. 18 లక్షలు కేటాయించారు. నామమాత్రంగా పూడిక పనులు చేపట్టగా మత్తడి, తూము పనులను పూర్తి చేయకుండానే సదరు కాంట్రాక్టర్ బిల్లులు పొందినట్లు సమాచారం. చెన్నూర్ మండలంలోని రాయిపేట చెరువు మరమ్మతులకు మొదటి విడత కింద రూ.17.20 లక్షలు కేటాయించారు. చె రువులో పిచ్చిమొక్కలు తొలగించడం, పూడికతీత, కట్ట మరమ్మతులు , కాల్వల నిర్మాణ పనులు చేపట్టగా నిర్మించిన నెల రోజులకే ఆనకట్టలు నాణ్యత లోపంతో పగుళ్లు తేలగా కాల్వల గుండా నీరు పారడం లేదు. అదే విధంగా హాజీపూర్ మండలంలోని వేంపల్లి చెరవులు పనులకు మొదటి విడతలో రూ. 23 లక్షలను కేటాయించారు. చెరువు ఆనకట్ట పనులు చేపట్టగా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఆనకట్ట కోతకు గురయింది. పంట పొలాలకు సాగు నీరు వెళ్లేందుకు రూపొందించిన ఫీడర్ ఛానల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. చెరువు ద్వారా పంట పొలాలకు నీరు అందకపోగా సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేసినట్లుగా బిల్లులు పొందినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్దరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments