Home వార్తలు బ్రేకప్ గోలకు బ్రేక్ వేస్తాడట!

బ్రేకప్ గోలకు బ్రేక్ వేస్తాడట!

aamir-khanబాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, కంగనారనౌత్‌లు బ్రేకప్ చెప్పేసుకొని అక్కడితో ఆగకుండా లీగల్ గొడవల వరకూ వెళ్లిపోయారు. రోజురోజుకూ ఈ వివాదం ముదరడమే తప్ప బ్రేకప్ గోలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగేలా చేసేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. హృతిక్, కంగనలు ఇద్దరూ అమీర్‌ఖాన్‌కు బాగా సన్నిహితంగా ఉంటారట. అమీర్ ఇంట్లో జరిగే ప్రతి పార్టీకి కంగనను పిలిచేంతటి రిలేషన్ ఉందట. దీంతో ఆమెను చల్లబరిచేందుకు ప్రయత్నిస్తున్నాడట అమీర్. మరోవైపు హృతిక్ రోషన్‌తో కూడా పబ్లిక్‌గా గొడవలు వద్దని వారిస్తున్నాడట అమీర్. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో… అమీర్‌ఖాన్ రెండు వర్షన్లను తెలుసుకొని వారిని శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. అమీర్‌ఖాన్ చెప్పిన మంచి మాటలతో వీరిద్దరూ తమ గొడవను వదిలేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.