Search
Thursday 15 November 2018
  • :
  • :

పెళ్లి పేరుతో వరుడి ఘరానా మోసం

రూ. 7లక్షలు తీసుకొని చేతులెత్తేసిన వరుడు
సిపికి ఫిర్యాదు చేసిన బాధితురాలు

Marriage

పెద్దపల్లి: అమ్మాయి పేరు మౌనిక(20) . తండ్రి పేరు బాపు. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండ లం నవాబ్ పేట స్వగ్రామం వడ్రంగి వృత్తిని నమ్ముకొని జీవి స్తున్న ఒ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కూతురు వివాహం ఘనంగా చేయాలని కూడబెట్టినదంతా వరకట్నంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆడ పిల్లల తల్లి దండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకొని నిశ్చితార్థం అయ్యాక ఎకంగా రూ. 7లక్షలు తీసుకొని పెళ్లికి నిరాక రించిన ఘరానా మోసగాడిపై పోరాటానికి సిద్ధమయింది ఒ యువతి . తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగ కూడదని , పెళ్లి పేరుతో మోసం చేసిన ఆ నయ వంచకుడికి శిక్ష పడాలని అంటున్న ఆ యువతి జరిగిన అన్యాయం పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ లో తన గోడు వెళ్లబోసుకొని కన్నీటి పర్యంత మయింది…

వివరాల్లోకి వెళితే రామగిరి మండలం నవాబ్‌పేటకు చెందిన బొల్లోజు మౌనికకు బేగంపేట ఎక్స్‌రోడ్ కు చెంది న విశ్వరోజు శివకుమార్(26)తో ఒ మధ్యవర్తి పెళ్లి సం బందం కుదిర్చాడు. పెళ్లికి గాను రూ. 5లక్షలు కట్నంగా ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గడిచిన డిసెం బర్ 19 న నిశ్చితార్థ వేడుకలను అమ్మాయి తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 15న వివాహ ముహు ర్తంగా నిర్ణయించారు .స్వతహగా స్వర్ణకారుడైన శివకు మార్ పెళ్లి నగలను తానే చేస్తానని పెళ్లి కుదిర్చిన మధ్య వ ర్తిని అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి వారిని నమ్మించి 3లక్ష ల 50వేల విలువ గల బంగారం, కట్నంగా ఇవ్వాలసిన 5 లక్షల నుంచి పెళ్లి ఖర్చుల నిమిత్తం మరో మూడున్నర లక్ష లు తీసుకొని పోయాడు .అమ్మాయి పెళ్లి ఘనంగా చేయా లనే ఆలోచనలతో,కావలసిన ఏర్పాట్లలో తీరిక లేకుండ ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు వరుడి మోసాన్ని కనిపెట్టలే క పోయారు.

పెళ్లికి వారం రోజుల ముందు మొదటి శుభ లేఖను ఆనవాయితీ ప్రకారం మగ పెళ్లివారికి ఇవ్వాలని బే గంపేట ఎక్స్ రోడ్ ల ఉన్న వరుడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటాన్ని చూసి , చుట్టు పక్కల వారిని ఆరా తీయగా జరిగిన మోసం బయట పడింది .పెళ్లి పేరుతో మోసానికి పాల్పడిన మోసగాడి పై , గ్రామంలోని కుల పెద్దల ద్వారా పంచాయతీ నిర్వహించినా ఒ కొలిక్కి రాక పోగా అమ్మా యి కుటుంబాన్ని బెదిరింపులకు పాల్జెయడంతో శనివారం పోలీస్ కమీషనర్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించా నని బాధితురాలు మౌనిక తెలిపింది .

Comments

comments