Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

వర్షాకాలంలో పెళ్లికూతురి మేకప్….

వర్షాకాలంలో పెళ్లిళ్లు అంటే మేకప్ పెద్ద సమస్యగా ఉంటుంది. పెళ్లిళ్ల మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉండదు. అలా కాకుండా పర్ ఫెక్టు లుక్ పొందటానికి కొన్ని టిప్స్ పాటిస్తే  సరిపోతుంది. మేకప్ అసహజంగా కనిపించకుండా అందంగా ఉండేలా చేస్తుంది. 

Bride-groom

* వర్షాకాలంలో చర్మరంధ్రాలు తెరుచుకుని ఉంటాయి. అందుకే మేకప్ చేయడానికి ముందు చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. మేకప్‌కు ఒకరోజు ముందు స్క్రబింగ్ చేసుకోవాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి. చర్మం మెరుస్తూ అందంగా ఉంటుంది.
* ఈ కాలంలో చర్మంపై ఎక్కువ సేపు నిలిచి ఉండే మేకప్‌ను ఎంచుకోవాలి. లాంగ్ లాస్టింగ్, వాటర్‌ప్రూఫ్ ఉండే ఉత్పత్తులను ఎంచుకోవాలి. అప్పుడప్పుడు చమట, తేమ కారణంగా మేకప్ కారడం లేదా విరిగిపోయినట్లు అవుతుంటుంది. అందుకే ఏడెనిమిది గంటలు నిలిచి ఉండే మేకప్‌ను తీసుకోవాలి.
* ముందుగా మీ స్కిన్ టైప్ గురించి తెలుసుకోవాలి. చర్మంపై డ్రై, సెన్సిటివ్, ఆయిలీ, డీహైడ్రేటెడ్, కాంబినేషన్ మెచ్యూర్ ఇలా ఏ రకమో తెలుసుకోవాలి. వర్షాకాలంలో చర్మాన్ని హైడ్రేట్ అంటే చర్మంలో తేమ నిలిచి ఉండటం అవసరం. బయటి ఉష్ణోగ్రత ప్రకారం దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడం అవసరం. అందుకే తగినంత మోతాదులో మంచినీళ్లు, లస్సీ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. టీ కాఫీలు వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
* మేకప్‌కు ముందుగా ముఖం, మెడపై బేస్, ప్రైమర్ రాసుకోవాలి. ప్రైమర్ మీ చర్మంలో పీహెచ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. చర్మం చెమట కంటే ఎక్కువ జిడ్డుగా కనిపించదు. మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే చెమట ఎక్కువగా వస్తుంది. అందుకు మేకప్‌కు ముందు ఐస్ సాయంతో కోల్డ్ కంప్రెషన్ తీసుకోవచ్చు. గది ఉష్ణోగ్రత కూడా ఇందులో ముఖమైన అంశం. ఉష్ణోగ్రతలో తేమ లేదా వేడి ఎక్కువగా ఉండకుండా చూడాలి. బేస్ రాసుకున్న తర్వాత వాటర్‌ప్రూఫ్ ఫౌండేషన్ రాసుకోవాలి.
-* కళ్ల మేకప్ కోసం మెటాలిక్, షిమర్, మెట్ ఐషాడోలను ఎంచుకోవాలి. -* మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ ఫిక్సర్ స్ప్రే చేయడం తప్పనిసరి. స్ప్రేను ముఖం నుంచి ఆరు అంగుళాల దూరం నుంచి స్ప్రే చేయాలి. -* అన్నింటికంటే ముఖ్యం దుస్తులు సహజంగా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి అతుక్కున్నట్లు ఉండకూడదు. చెమట కారణంగా అసహజంగా కనిపిస్తుంది. -* ప్రస్తుతం లైట్ జ్యువెలరీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫ్లోరల్, ఉడెన్, షెల్ నెక్‌పీస్‌లు ఎంచుకోవాలి. లేకుంటే ఏదైనా మెటల్ లైట్ పీస్ కూడా వేసుకోవచ్చు. -* జట్టును కర్ల్ చేసుకోకపోవడం మేలు. ఎందుకంటే తేమ కారణంగా త్వరగా ఓపెన్ అవుతాయి. హెయిర్ స్టైల్ కుదరదు. బన్, పఫ్, క్రాస్ బ్రాడ్స్, సైడ్ ఫ్రెంచ్ బ్రాడ్స్‌లాంటివి ఎంచుకోవచ్చు. స్టయిల్‌గా ఉంటారు.

Comments

comments