Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వింత ఆచారం..!

Bride

ఖమ్మం: పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు వేషధారణలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. చూసినవారందరూ ఆశ్చర్యానికి గురికావడం ఖాయం కదా. అచ్చం అలాగే జరిగింది  ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల పరిధిలోని చొప్పకట్లపాలెంలో. పెళ్లి తంతు ముగిశాక… వరుడు చీర కట్టి స్త్రీ వేషధారణలో రావడంతో పెళ్లికి వచ్చినవారంతా అవాక్కయ్యారు. అదేదో తషాగా అలా వచ్చి ఇలా వెళ్లిపోలేదు.

ఊరేగింపుగా ముత్యాలమ్మ గుడి వరకు నడుచుకుంటూ వెళ్లి మొక్కులు చెల్లించడం గమనార్హం. అయితే ఇది తమ కుటుంబ ఆచారమని తెలపడంతో పెళ్లికి వచ్చినవారంతా వింతగా చూశారు. స్థానికంగా ఉండే కాటేపల్లి చంద్రశేఖర్‌కు కృష్ణాజిల్లా అనిగండ్లపాడుకు చెందిన కృష్ణవేణితో ఆదివారం ఘనంగా పెళ్లి జరిగింది.

అనంతరం వరుడు కుటుంబ ఆచారం ప్రకారం పెళ్లి జరిగాక చీరకట్టి, స్త్రీ వేషధారణలో నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో అతడి పాదం నేలపై తాకకుండా గుడివరకు చీరలు పరుస్తూ.. వారి కుటుంబీకులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దీంతో స్థానికులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులంతా ఆశ్చర్యంగా తిలకించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తోంది.

Comments

comments