Home జాతీయ వార్తలు కోల్‌కతా: సిసిటివి ఫుటేజీలో భయానక దృశ్యాలు..( వీడియోతో)

కోల్‌కతా: సిసిటివి ఫుటేజీలో భయానక దృశ్యాలు..( వీడియోతో)

kolkatha-bridge-collaps-imaకోల్‌కతా: కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయిన సంఘటనకు చెందిన భయానక వీడియోలు సిసిటివి కెమెరాలో బంధించబడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న సిసిటివిలను అధికారులు పరిశీలించారు. ఆ వీడియో పశ్చిమబెంగాల్ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమౌతున్నాయి. సిసిటివి ఫుటేజీ దృశ్యాలు యూ ట్యూబ్‌లో కూడా పోస్ట్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ట్యాక్సీలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నడుస్తున్నాయి. పాదాచారులు కూడా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనపడుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారి కూలిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు, పాదాచారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కాగా, శిథిలాలను తొలగించే పనిలో ప్రభుత్వాధికారులు నిమగ్నమయ్యారు.

https://www.youtube.com/watch?v=HwhG0Ti5Zz8