Home నిర్మల్ తెగిన పల్కేరి వాగు తాత్కాలిక వంతెన

తెగిన పల్కేరి వాగు తాత్కాలిక వంతెన

                      Heavy-Rain

పెంబీ : మండలంలో శనివారం రాత్రి కురిసిన బారీ వర్షానికి వాగులు వంకలు వరదలతో ముంచెత్తాయి. మందపెల్లి సమీపంలో గల పల్కేరి వాగు తాత్కాలిక వంతెన తెగి పెంబీ – ఖానాపూర్ మండలాల మద్య రాకపోకలు 5 గంటల పాటు స్తంభించాయి. వెంటనే బ్రిడ్జ్ కాంట్రాక్టర్ సంఘటన స్థలాలకు చేరుకుని తెగిపోయిన వంతెనను మరమ్మత్తులు చేయించారు. మొదటి సారి కురిసిన వర్షానికే బ్రిడ్జ్ కోసం ఏర్పాటు చేసిన పైపులు కొట్టుకపోవడంతో వర్షాకాలంలో పరి స్థితి ఏవిధంగా ఉంటుందోనని పలువురు ఆవేధన వ్యక్తపరు స్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరారు.