Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కోహ్లీ పెయింటింగ్.. ధరెంతో తెలుసా..?

Virat-Painting

బర్మింగ్‌హామ్ : ఇండియన్ కెప్టెన్, విధ్వంసక ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలంలో బ్యాట్ పట్టి పరుగులు సాధించడమే కాదు… సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్న టీమిండియా జట్టు రేపు సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. సరే అసలు విషయానికొస్తే… కోహ్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ పెయింటిగ్ ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారుడు సాశా జాఫ్రీ ఓ పెయింటిగ్ వేశారు. విరాట్ ఐపిఎల్ ప్రస్థానాన్ని సూచిస్తూ వేసిన ఈ పెయింటింగ్‌ను విరాట్ అభిమాని బ్రిటిష్-ఇండియన్ పారిశ్రామిక వేత్త పూనమ్ గుప్తా రూ.24 కోట్లకు సొంతం చేసుకున్నారు. కాగా ఈ డబ్బును క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచే విద్యార్థుల ప్రోత్సాహానికి ఖర్చు చేస్తామని కోహ్లీ ఫౌండేషన్ నిర్వహకులు తెలిపారు. దీంతో విరాట్ కోహ్లీ మంచి ఆటగాడినే కాకుండా.. మంచి మనిషిగా కూడా మార్కులు కొట్టేశాడు..

Comments

comments