Search
Thursday 15 November 2018
  • :
  • :

‘బాహుబలి-2’ను తిలకించనున్న బ్రిటన్ మహారాణి?

Baahubali-First-Look

బాహుబలి-2 చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కానీ ప్రేక్షకులకంటే ముందే గ్రేట్ బ్రిటన్ క్వీన్ అయిన ఎలిజబెత్ 2 ఈ సినిమాను చూడనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15తో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ వారు మన సినిమాలను గౌరవిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రామానికి బ్రిటన్ మహారాణి ముఖ్య అతిథిగా రానుంది. ఇందులో భారతీయ సినీ ప్రముఖులు ‘బాహుబలి 2’ సినిమాను ప్రదర్శించి… భారతీయ సినిమా ఇప్పుడు ఏ రేంజుకు ఎదిగిందో ఆమెకు వివరిస్తారట. ఈ కార్యక్రమానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడి కూడా వెళ్తారని తెలిసింది. అయితే బాహుబలి 2 సినిమాను రెండు గంటలకు పైగా కూర్చొని చూసేంత ఓపిక బ్రిటన్ మహారాణికి… చూసేంత తీరిక ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా అనేదే అసలు ప్రశ్న. ఒకవేళ వీళ్లకు కనీసం 15 నిమిషాల పాటు సినిమా హైలైట్స్ చూపిస్తారేమో.

Comments

comments