Search
Monday 23 July 2018
  • :
  • :

బ్రిటన్ కోర్టు ఆదేశాలు సంతోషాన్నిచ్చాయి

 British court to confiscate assets Vijay Mallya

మాల్యా బకాయిల రికవరీకి యుకె ఏజెన్సీలతో కలిసి పనిచేస్తాం                                                                                     ఎస్‌బిఐ ఎండి అరిజిత్  బసు

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు బ్రిటన్ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఆస్తుల రికవరీ దిశగా భారతీయ బ్యాంకులు బ్రిటన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాయని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎండి అరిజిత్ బసు తెలిపారు. వేల కోట్ల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాకు వ్యతిరేకంగా బ్రిటన్ కోర్టు చేసిన ఆదేశాలు తమకు సంతోషాన్ని ఇచ్చాయని, తదుపరి చర్యలు చేపడతామని ఆయన అన్నారు. మాల్యా ఆస్తులు అమ్మి ఇప్పటివరకు రూ. 963 కోట్ల రుణాలు సేకరించినట్లు వెల్లడించారు. మాల్యాకు రుణాలు మంజూరు చేసిన 13 బ్యాంకుల కన్సార్టియంకు ఎస్‌బిఐ ప్రాతినిథ్యం వహిస్తోంది. తమ బకాయిలన్నింటినీ మాల్యా వద్ద నుంచి రికవరీ చేసుకుంటామని బసు అన్నారు. బ్రిటన్ అథారిటీలతో కలిసి భారతీయ బ్యాంకులు పనిచేస్తాయని అన్నారు. బకాయిల్లో ఎంత మొత్తాన్ని రికవరీ చేస్తారో ప్రకటించనప్పటికీ, తమ బకాయిడిన నగదులో ఎక్కువ భాగమే రికవరీ చేపడతామని ఆయన తెలిపారు. తమ బకాయిలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ 13 బ్యాంకుల కన్సార్షియం వేసిన పిటిషన్‌ను విచారించిన బ్రిటన్ హైకోర్టు జడ్జి ఈ మేరకు సానుకూల ఉత్తర్వులు జారీ చేసింది. మాల్యాకు బ్రిటన్‌లో ఉన్న ఆస్తుల్లో న్యాయస్థాన అధికారులు అడుగుపెట్టేందుకు లండన్ హైకోర్టులోని క్వీన్స్ ధర్మాసనం ఇటీవల అనుమతి మంజూరు చేసింది. లండన్ సమీపంలో మాల్యాకు పలు ఆస్తులున్నాయి. హైకోర్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఆయన అధికార పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్ ఎవరైనా లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లోని అన్ని భవనాల్లోకి ప్రవేశించి సోదాలు చేసేందుకు, మాల్యాకు చెందిన వస్తువులను జప్తు చేసేందుకు అనుమతిస్తున్నట్టు జస్టిస్ బిరాన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Comments

comments