Home జాతీయ వార్తలు ముగ్గురు అంధ విద్యార్థులపై లైంగిక దాడి!

ముగ్గురు అంధ విద్యార్థులపై లైంగిక దాడి!

Blind-Student-Rape

న్యూఢిల్లీ : ముగ్గురు అంధ విద్యార్థులపై బ్రిటన్ కి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం బాలురపై లైంగిక దాడికి పాల్పడుతూ అతను పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కి చెందిన ముర్రే డేనిస్‌ వార్డ్‌(54) గుర్‌గావ్‌లో ఓ ప్రముఖ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. ఆ తర్వాత దిల్లీలో అంధ బాలుర కోసం ఎన్జీవో సంస్థ నడుపుతున్న ఆశ్రమంలో పాఠాలు చెప్పేందుకు ఒప్పుకున్నాడు. అయితే శనివారం నిర్వాహకులకు వార్డ్ ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. దీంతో అతడు వెళ్లిపోయాక విద్యార్థులను ప్రశ్నించగా.. అసలు విషయం బయటకొచ్చింది. తమపై వార్డ్ తరుచూ లైంగిక దాడికి పాల్పడేవాడని విద్యార్థులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని వార్డ్ ఇంటికి వెళ్లారు.

అదే సమయంలో వార్డ్ విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడుతూ.. వారిపై అఘాయిత్యం చేసిన సమయంలో తీసిన వీడియోలను సెల్ ఫోన్లో చూస్తూ.. రెడ్ హ్యాండడ్ గా పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు వార్డ్‌ని అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న ఫోన్‌, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వార్డ్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని, 10సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు చెప్పారు.