Home తాజా వార్తలు సంథింగ్ స్పెషల్ గా ‘బ్రోచేవారెవరురా’…(టీజర్)

సంథింగ్ స్పెషల్ గా ‘బ్రోచేవారెవరురా’…(టీజర్)

Brochevarevaru Raవైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘మెంటల్ మదిలో’ సినిమాకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టీజర్ చూస్తుంటే ఈసారి కూడా విష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతోనే వస్తున్నట్లు అర్ధమవుతోంది. నివేదా థామస్, నివేదా పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో సత్య దేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్‌కుమార్ మన్యం ఈ సినిమా నిర్మిస్తున్నారు. వివేక్‌సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక గతకొంత కాలంగా  చిన్న సినిమాలు కొత్తదనమే ప్రధాన ఆయుధంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మూవీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ వంటి విషయాలను పక్కనపెడితే చిత్ర కథ కథనం ఎంత డిఫరెంట్ గా ఉందన్నదే ముఖ్యం. యువ హీరో శ్రీవిష్ణు  నుంచి గత కొంత కాలంగా అలాంటి కథలే ఎక్కువగా చూస్తున్నాం. యూత్ తోపాటు ఫ్యామిలీలను లక్ష్యంగా చేసుకొని సాఫ్ట్ కథలను వదలడంతో మనోడి స్టయిలే వేరు. ఎలాంటి హడావుడి లేకుండా సినిమా విడుదల చేయడం.. అంతే సాఫ్ట్ గా హిట్ కొట్టడం శ్రీవిష్ణు అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తికాదు. ఇంకేందుకు ఆలస్యం తాజాగా విడుదలైన ‘బ్రోచేవారెవరురా’ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Brochevarevaru Ra Teaser is Released