Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ధాన్యం దళారుల పాలు

Paddy

బోధన్: ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షాలు, వడగండ్ల, భూగర్భజలాల్లో నీటిశాతం తగ్గిపోయి పంటలకు నష్టాలు వాటిల్లుతుంటే మరోవైపు పండించిన ధాన్యనికి ధరలు, కొను గోలు కేంద్రాలు లేక రైతులు విలవిలపోతున్నారు. ప్రభుత్వ పరంగా వరిడాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడంతో పండించిన వరిధాన్యాన్ని ప్రైవే టు వ్యక్తులకు అమ్ముకోవలసివస్తుంది. బోధన్ డివిజన్‌లోని బోధన్, వర్ని, రూద్రర్, కోటగిరి, ఎడపల్లి మండలాల్లో వరిపంటలు కోతదశకు చేరుకున్నాయి. వరికోత దశకు రాగానే రైతులు ఆకాల వర్షాలు, వడగండ్లకు బయపడి వెంటనే వరికోత యంత్రాలతో కోతను ప్రారంభించారు. వరి కోతలు ప్రారంభమై పదిరోజులు అవు తున్న నేటికి ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచ నీయమని రైతులు వాపోతున్నారు.

కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ము కోవలసి వస్తుందన్నారు. రాజ్యమేలుతున్న దళారులు… వరిధన్యం కొనుగోలు చేయడానికి దళారులు రాజ్యమేలుతున్నారు. మార్కెట్లో వరిధాన్యానికి మార్కెట్లో క్విం టాళ్లకు 1600 నుంచి 1800ల రూపాయలకు ధర పలుకుతుండగా దళారులు మాత్రం క్వింటాళ్లకు 1500 రూపాయలకు మించి ధర పెట్టడంలేదు. దీంతో రైతులు క్వింటాళ్లకు రెండు వందల రూపాయాల చోప్పున నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వరిధాన్యం కొనుగోలు చేసే దళారులందరు కుమ్మకై వారు నిర్ణయించిన ధరకే వరి దాన్యన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం పరంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వపరంగా నేటికి ప్రారంభించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించవలసి వస్తుందన్నారు. వరికోత యంత్రాలతో కోసిన వరి ధాన్యాన్ని స్టాక్ చేయడానికి స్థానికంగా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు వరికోత యంత్రాలతో కోసిన వరి ధాన్యాన్ని వెంటనే ప్రైవేటు కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకోవలసివస్తుంది. దళారులు ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వరిధాన్యాన్ని కోనుగోలు చేయడం ప్రారంభించారు. దళారులపై రైతులకు పూర్తి నమ్మకం లేక పోయిన రైతుల ఒకరిని చూసి మరోకరు అమ్మడం ప్రారంభిస్తున్నారు.

దళారులు రైతులకు నమ్మకాన్ని కల్పిస్తూ వరిని కోనుగోలు చేస్తు న్నారు. బోధన్ డివిజన్‌లోని మండలంలో దళారులు ఇప్పటికే పది రోజుల నుంచి వరికోనుగోళ్లు ప్రారంభించారు. రైతులకు డబ్బులు చెల్లించడంలో వాయిదా పద్దతిలో పెట్టుకోని వరిధాన్యాన్ని కోనుగోలు చేస్తున్నారు. ప్రతియేట ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసిన రైతులకు ఉపయోగం ఉండడం లేదన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్థాపించే వరకు రైతులు 50శాతం వరకు ప్రైవే టు వ్యక్తులకు అమ్ముకోవలసివస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. లారీ యాజమానుల సమ్మె… మరో వైపు లారీ యాజమానులు వారి డిమాండ్‌లను పరిష్కరించాలని సమ్మె చేస్తుండడంతో వరిదాన్యం కేనుగోలు కేంద్రాలపై ప్రభావం చూపుతుంది. వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీల యజమానులు సమ్మెచేస్తుండడంతో ధా న్యాన్ని కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కుప్పలుతెప్పలుగా పోసి ఉంచవలసి వస్తుంది. రైతులు అకాలవర్షాలకు భయపడి వ్యాపారుల వద్దకు వెళ్ళి ధాన్యాన్ని కోనుగోలు చేయాలని ప్రదేయపడుతున్నారు. కష్టించి పండించిన దాన్యం వరికోతయంత్రాలతో కోసిన తర్వాత వరిధాన్యాన్ని శివా రు ప్రాంతాలలో అలానే ఉంచితే అకాలవర్షాలు కురుస్తు తడిసిముద్దవుతుందని రైతులు ధాన్యాన్ని నిల్వచేయడానికి భయపడుతున్నారు.

ఒకవైపు లారీ యాజమా నుల సమ్మె మరోవైపు ప్రభుత్వపరంగాకొనుగోలు కేంద్రాలు లేకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పండించిన ధాన్యాన్ని వెంటనే అమ్మివేసి చేతు లు దులుపుకోవాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. రైతులు ఇబ్బందులను దళారులు ఆసరగా చేసుకోని తక్కువ ధరకు దన్యాన్ని కొనుగోలుచేసి డబ్బులు సంపాదించుకో నుచున్నారు. వరికోత యంత్రాలకు పెరిగిన డిమాండ్… వరికోతలు ప్రారంభమవ డంతో వరికోత యంత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. పదిరోజుల క్రితం వరికోత యంత్రాలకు గంటకు 1800రూపాయలు ఉండగా నేడు గంటకు 2200 రూపా యల ధర పెరిగింది. వరికోత దశకు రాగానే రైతులు వరికోత యంత్రాల చుట్టు తిరుగుతున్నారు. ప్రతియేట వరికోత దశకు రాగానే అకాల వర్షాలకు పంటలు నష్ట పోతున్నాయి. దీంతో రైతులు కోతదశకు రాగానే వెంటనే వరిని యంత్రాలతో కోసి అమ్మివేయాలనే ఆలోచనతో రైతులు ఉన్నారు. దీంతో వరికోతయంత్రాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకోని వరికోత యంత్రాల యజమానులు రోజుకోధరను నిర్ణయించి వరిని కటింగ్ చేస్తున్నారు. అధి కారులు స్పందించి వరికోత యంత్రాల ధరను అదుపు చేయాలని రైతులు కోరుతున్నారు.

కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కృష్ణారెడ్డి, రైతు, బర్దిపూర్

ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కొను గోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవలసి వస్తుంది. అకాల వర్షం వస్తుం దని భయంతో కోతదశకు రాగానే వెంటనే వరికోత యంత్రా లతో కటింగ్ చేస్తున్నాం. అలాగే వరికోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. గంటకు రూ.2200 తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వపరంగా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారం భించాలి. ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్మడంతో ఆర్ధికంగా నష్టం వస్తుంది.

లారీల సమ్మెను విరమింపచేయాలి: సంజీవ్‌రెడ్డి, రైతు, బర్దిపూర్

లారీ యజమానులు సమ్మె చేస్తుండడంతో దాన్యన్ని కొనేవారు ముందుకు రాలేక పోతున్నారు. వ్యాపారులు దన్యాన్ని తక్కువ ధరకు కోనుగోలు చేసి సోమ్ముచేసుకుం టున్నారు. వరికోతలు ప్రారంభమై పదిరోజులు అవుతున్నానేటికి ప్రభుత్వపరంగా కొనుకోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
దీంతో ప్రైవేటు వ్యాపారస్థులకు ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తుంది. అలాగే వరికోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. అకాల వర్షాలకు బయపడి వరిని త్వరగా కటింగ్ చేస్తున్నాం. అలాగే లారీల సమ్మెను విరమింపచేయాలి.

Comments

comments