Home కుమ్రం భీం ఆసిఫాబాద్ బాలికలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి

బాలికలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి

Police

కెరమెరి: బాలికలు అపరిచిత మోసగాళ్ల మాయమాటలు ప్రలో భాలు,ఆకర్షణకు లోనుకాకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నతగా ఎదగాలని కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సన్‌ప్రిత్‌సింగ్ చెప్పారు. శనివారం మండ లంలోని కోలంజరి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు, బాలికల అక్రమ రవాణా నివారణ చర్యలు అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహిం చారు. అంతకు ముందు ఎస్పీ సన్‌ప్రిత్‌సింగ్‌కు ఆదివాసులు తమ సంప్రదాయ వాయిద్యాలతో గుస్సాడి నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ బాలికలు ఆత్మనూ న్యతా భావాన్ని విడనాడి ధైర్యంగా జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని సాధించే వరకు కఠోరంగా శ్రమించాలన్నారు. జీవితంలో లక్షసాధనలో ఎన్నో అవంత రాలు ఎదురవుతాయని ధైర్యంగా ముందుకుసాగాలన్నారు. పోలీసులు ఎల్ల ప్పుడు బాలికల వెంటా ఉంటారని ఏ ఆపద వచ్చిన నేరుగా గాని,ఫోన్ ద్వారా గాని సంప్రదించాలని సూచించారు. ఆకతాయిలు వేధిస్తే 100 నంబర్‌కు డయల్ చేయాలన్నారు. పేదరికం,వెనుకబాటుతనం,అమాయికత్వం ఆసరాగా చేసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన మోసగాళ్ళు ఇక్కడి అమ్మాయిలను లోబర్చు కోని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్దాన్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి వచ్చే ముఠాలు ఈ ప్రాంతాల పైదృష్టిసారించి బాలికల అక్రమ రవాణాకు పూనుకుంటున్నాయని చెప్పారు.

అక్కడి రాష్ట్రాలలో సగటు అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండడంతో గిరిజన ప్రాంతాల పై అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తీసుకవెళ్తున్నారని చెప్పారు. దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఘటించాలని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యార్దులు అభివృద్ది చెందాల న్నారు. బాలికలు ఉన్నతగా ఎదిగి తల్లిదండ్రులతో పాటు తమ ప్రాంతంపేరును పేరు ప్రఖ్యాతను చాటిచెప్పాలన్నారు. అంబేద్కర్ యూనివర్సిటి న్యూఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాలీన్‌టినా మాట్లాడుతూ దేశంలో మహిళలు, బాలికల అక్రమ రవాణా పెద్దఎత్తున సాగుతుందని యుక్త వయస్సు వచ్చిన బాలికలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యావంతులు, గ్రామ పెద్దలు బాలికలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉన్నత విద్యతోనే అన్ని సమస్యలు తీరుతాయని అదిశగా బాలికలు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని అన్నారు.

అనంతరం స్దానిక పాఠశాల బాలబాలికలను ఎస్పీ సన్‌ప్రిత్ సింగ్ స్కూల్ బ్యాగులు, పుస్తకాలు,పెన్నూలు,పెన్సిళ్ళు పంపిణీ చేశారు. అనంతరం విద్యా ర్థినిలతో కలిసి సహపంక్తి బోజనం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎ.బాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాలిన్‌టినా,సిఐ ప్రసాద్‌రావు,ఎస్సై సత్యనారాయణ, సర్పంచ్ చలపతి,గిరిజన సంఘాల నాయకులు ఆత్రం లక్ష్మణ్, పోచయ్య, రమణ,జగన్నాథ్, కెవిబిబి ప్రత్యేకాధికారి మీనా,వైద్యులు సౌజన్య,శ్రీవిద్యతో పాటు తల్లిదండ్రులు,గ్రామస్దులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.