Home నాగర్ కర్నూల్ చేపా చేపా ఎవర్ని బతికిస్తున్నావ్

చేపా చేపా ఎవర్ని బతికిస్తున్నావ్

కోట్ల ఆదాయం కొల్లగొట్టుకు పోతున్నారు
స్థానికులకు దండగ..దళారులకు పండుగ

Lake

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : సర్కారీ లెక్కల ప్రకారం చేపల పెంపకం ద్వారా జిల్లాకు కోట్లలో ఆదా యం రావల్సి ఉంది. మత్సకారుల ఆర్థిక స్థితి గతుల్లో గణనీయమైన మార్పులు కూడా రావల్సి ఉంది. అయితే సరైన మార్కెట్ సౌకర్యంలేకపోవడం,మత్స్యకారుల సం ఘాలలో చైతన్యలోపం ,ఆర్థిక బలహీనతలవల్ల చేపల ఉత్పత్తి, వ్యాపారం స్థానికులకు దండగ దళారులకు పం డుగలా మారింది.

కోట్లలో ఆదాయం : జిల్లాలోని పలు చెర్వులు కుంటలు జలాశయాలలో ప్రభుత్వం తరఫున దాదాపు రూ.60వేల విలువ గల 74లక్షల చేపపిల్లలను వదిలింది. మత్సకారు లు అంతకు మూడు రెట్లు అధికంగా తమ స్వంత ఖర్చుతో చేపపిల్లల్ని పెంచుకున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం తాము వదిలిన చేపల్లో 60శాతం బ్రతికితే అవి పెరిగి దాదాపు నాలుగున్నర టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయి. కిలో రూ.60చొప్పున అమ్మినా వీటివల్ల దాదాపు రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇక మత్సకారుల సంఘాలు నీటిలో వదిలిన చేపపిల్లల నాణ్యత మెరుగ్గా ఉందటం అవినీతి పెరిగి ఆరుకోట్లకు పైగా ఆదాయం వస్తుందన్న అంచనాలున్నాయి.

అంటే ప్రభుత్వం ,మత్సకారులు వదులుకున్న చేపపిల్లలతో 16వందల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నా యి. వీటినుండి 8నుండి 10కోట్ల రూపాయల ఆదాయం మత్సకారులకు రావల్సి ఉంది. దాదాపు 10వేల మంది మత్సకారుల సంఘాలకు సరిగ్గా ఈ ఆదాయం అందితే ఒక్కొ కుటుంభ ఆదాయం భారీగానే ఉంటుంది.

తరలి పోతున్న మత్స సంపద: నదిలో తప్ప ఇతర జలాశయాల్లో కేవలం వేసవిలోనే చేపలు లభ్యమవుతుంటాయి. సీజన్‌లో వచ్చే చేపల కోసం మత్స కారులు కళ్లలో వత్తులు వేసుకుని కాపలా కాస్తుండగా మత్ససంఘాలకు దళారులు అడ్వాన్సుల పేరిట వలలు వేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలో దళారులు ఈ సంఘాలకు లక్షల్లో అడ్వాన్సులు ఇస్తున్నారు. సీజన్‌లో చేపల చెర్వులపై గద్దల్లా వాలుతున్న దళారులు తక్కువ ధరకు చేపల్ని కొనుగోలు చేస్తున్నారు. మత్సకారులు స్థానిక మార్కెట్‌లో వందనుండి వందాయాబై రూ పాయల వరకు కిలో చేపలు విక్రయిస్తుండగా దళారులు మాత్రం ప్రభుత్వ అంచనా ధర రూ. 60కన్నా అతి తక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ముఖ్యం గా చిన్న చిన్న చేపల్ని స్థానికులకు వదిలి కిలోన్నర నుండి రెండుకిలోల పైగా తూకం ఉన్న చేపల్ని మాత్రమే దళారులు కొనుగోలు చేస్తున్నారు. మత్స కారుల వద్ద కేవలం కిలో చేపల్ని రూ. 20నుండి 38 రూపాయల ధర చెల్లిస్తు న్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన చేపల్ని హైదరాబాద్ ,కలకత్తాలోని హౌరా బె, బెంగుళూరు మార్కెట్‌లకు తరలిస్తున్నారు. నామ మాత్రపు ధరకు మత్స కారుల వద్ద కొనుగోలు చేసిన ఈ చేపల ధర పెద్ద మార్కెట్‌లలో కిలో రూ. 300నుండి 400వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక మ త్సకారులకు వేలలో ఆదాయం వస్తుండగా దళారులు కొట్లలో దండు కుంటున్నారు.

కోల్డు స్టోరేజీలు లేక: వేసవిలో చెర్వులు జలాశయాల్లో పట్టే చేపల్ని స్థానికంగా నిల్వ చేసే అవకాశాలు మృగ్యం .స్వతహాగా కోల్డు స్టోరేజీలు ఏర్పాటు చేసుకోలేక ప్రభుత్వ పరంగా సాయంలేకపోవడంతో ఏరోజు పట్టిన చేపల్పి ఆరోజే అమ్ముకుని తీరాల్సిన పరిస్థితి .ధర తక్కువయినా దళారులకు నమ్ముకోక తప్పని దుస్థితి.