Search
Wednesday 21 November 2018
  • :
  • :

బోగస్ పాసుపుస్తకాల పాపం ఎవరిది

Passbook

కోడేరు : మండలంలో బోగస్ పాసు పుస్తకాలు హల్‌చల్ చేస్తునాయి. ఒకే సర్వే నంబర్‌పై అనేక మందిని సృష్టించి బోగస్ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతులకు అంటగట్టారు. వీటితో రైతులు దళారులు బ్యాంక్ల్లో లోన్లు తీసుకొని తమ అవసరాలు తీర్చుకుంన్నారు. తీరా సదరు బ్యాంకుల్లో లోన్లు తిరిగి చెల్లించకపోవడంతో ఒక్కోక్కటిగా బోగస్ పాస్ పుస్తకాల బండారం బయట పడుతుంది. ఈ వ్యవహరంలో పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ అధికారుల హస్తముందా… లేక బోగస్ పాస్ పుస్తకాలని తెలిసి కూడ బ్యాంక్‌ల్లో లోన్లు ఇచ్చిన బ్యాంక్‌ల హస్తమెంతా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన ఒక బ్యింక్‌లో సుమారు కోటీ యాబై లక్షల వరకులోన్లు పొందారంటే బోగస్ పాస్ పుస్తకాల వ్యవహరం ఏ స్థాయి నడిచిందో అర్థం చేసేకోవచ్చు.

మండల కేంద్రలోని సర్వే నంబర్ 285లో 42 మంది రైతులకు ప్రభుత్వం అసైన్‌మెంట్ కమిటీ ద్వారా పట్టాలిచ్చారు. ఇదే భూమిపై మండలంలో కొందరు బోగస్ పాస్ పుస్తకాలను సృష్టించి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. అలాగే మండల కేంద్రం లోని సర్వే నంబర్ 479,552 , 562, 560, 424, 285 లల్లో పట్టాలు పొంది బ్యాంక్‌ల్లో లోన్లు తీసుకున్నారు. సదరు బ్యాంక్ వారు లోన్లు తీసుకున్న వారికి నోటీసులు పంపింది. ఇంత జరుగుతున్న ఎవరికి ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని నాగులపల్లి, నర్సాయిపల్లి, మైలారం, సింగాయిపల్లి గ్రామాల్లో బోగస్ పాస్ బుక్‌లతోలోన్లుతీసుకున్నారనిబ్యాంక్‌లేచెప్పుకొస్తున్నాయి.

ఇది సంగతి: బ్యాంక్‌ల్లో లోన్లు పొందాలంటే భూములు కలిగి ఉన్న రైతులు భూమి పాస్ పుస్తకాలు, ఆరోవార్, పహానీలు కల్గి ఉండి ఏ బ్యాంక్‌ల్లో లోన్లు తీసుకొలేదని చుట్టు ప్రక్కల బ్యాంక్‌లు దృవీకరించాలి. సదరు భూమి ఆ యజమానులదేనని రెవెన్యూ అధికారులు దృవీకరించాల్సి ఉంటుంది. వీటిని అన్నీంటిని కల్గి ఉంటూనే బ్యాంక్‌లు రైతులకు రణాలు మంజూరు చేస్తాయి. అయితే అన్నీ ఉండి నిజమైన రైతులు రుణాలు పొందాలంటే నానా తం టాలు పట్టే బ్యాంక్‌లు వీరికి ఎలా రుణాలు ఇచ్చాయని ప్రజలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణాలు పొందేందుకు రెవెన్యూ శాఖలో ఎవరి అండా లేకుండా ఈ పనులు చేయలేరన్నది నగ్నసత్యం.

ఆ వ్యక్తి ఎవరనేది ప్రశ్న..ఒక పాస్ పుస్తకం పొందాలంటే ఎన్నో ఇబ్బందు ఎదుర్కొనే రైతులకు అంత సునాయాసంగా ఎలా పొందగలిగారు. భూములు అమ్ముకున్న రైతులతో  వృథాగా పడివున్న పాస్‌పుస్తకాలను సేకరించి పోటోలు పేర్లు మార్చి ఇస్తు న్నారనే వాదనలు వినిపిస్తున్నాయి . ఒక్కో పాస్‌పుస్తకానికి వేలల్లో చేతులు మారాయని లబ్దిదారులే అంటున్నారంటే సమస్య ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే బ్యాంక్‌ల్లో లోన్లు పోందే ముందు రెవెన్యూ అధికారులతో దృవీకరించుకుంటారు. మరి బ్యాంక్ అధికారులు అలా ఎందుకు చేయలేదు. బ్యాంక్‌ల్లో లోన్లు పొందిన తరువాత వాటిని రికవరి చేసేందుకు తలలు పట్టుకుంటున్నారు సదరు బ్యాంకర్లు. భూములు లేకు న్నా బోగస్ పాస్ పుస్తకాలు సృష్టించిన వారిపై ,లోన్లు తీసుకున్న వారిపై చర్య తీసుకొని ప్రజాదన్నా కాపాడాలని, రెవెన్యూ, బ్యాంక్ వ్యవస్థలపై నమ్మకం పెంచేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments