Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పైసలిస్తే సరి!

పైసలిస్తే సరి.. అది ప్రభుత్వ భూమైనా రిజిస్ట్రేషన్ అయిపోతుంది! అదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇక్కడ దళారుల హవా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి భూమితో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్‌లు జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించారని.. దీని ప్రకారం కార్యకలాపాలన్నీ సాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ధనార్జనే ధ్యేయం…

అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా జిల్లాలోని ప్రభుత్వ భూములు సైతం రిజిస్టేషన్ చేసేస్తున్నారు. పనికో రేటు నిర్ణయించి డబ్బులను పిండికోవడం తంతుగా మారింది. అక్రమ సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నా అధికారులు మాత్రం మిన్నకుంటున్నారు. కొందరు అధికారులు, సిబ్బంది తోడవటంతో దళారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అంతా ఇష్టారాజ్యం అయిపోయింది. డబ్బులిస్తే నిబంధనలన్నీ అతిక్రమించి పనులు కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని రిజిస్ట్రర్ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి రోజుకు రూ. 60 లక్షల ఆదాయం సమకూరుతుంటే

‘సబ్ రిజిస్టార్’లో దళారులదే హవా
మామూళ్లిస్తే ప్రభుత్వ భూమికీ రిజిస్ట్రేషన్!

Bribe

అక్రమార్కులు రూ. 6 నుంచి 10 లక్షల వరకూ అప్పనంగా జేబుల్లో వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల పర్యరక్షణ కోసం సర్కారు కంకణం కట్టుకోగా జిల్లాలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేస్తుండటంపై గత కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. ప్రతి పనికో ధర… ఒకరి భూమి మరోకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఓ ధర… ప్రభుత్వ పాత రికార్డులలో పేజీలు చింపి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు మరో ధర, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇంకో ధర… ఇలా రిజిస్ట్రేషన్ పక్రియలో ప్రతి అవినీతి పనికీ ఇంత రేటు నిర్ణయించినట్టు తెలుస్తోంది. జిల్లాలో
పెద్ద సంఖ్యలో భూ తగాదాలు జరుగుతుండడానికి ఈ తంతే కారణమని పలువురు అంటున్నారు. ఈ వ్యవ హరాలలో కొందరు లేఖర్లు దళారులుగా వ్యవహరిస్తూ తమ వాటాలు దక్కించుకుంటున్నారనే ఆరోపణాలువినిపిస్తున్నాయి.

క్రయ విక్రయాలలో దళారులు ప్రధాన భూమిక పోషిస్తూ అసలు యాజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేయిస్తూ దందాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. విదేశాలలో ఉండే వారు, ఉద్యోగాలతో ఇతర ప్రాంతాలలో నివసిస్తూ ఉండే వారి
భూములే లక్షంగా అక్రమాలు జరుగుతున్నాయి. అంతా అయిపోయాక తెలుసుకొని అసలు భూముల, అసలు దారులు లబోదిబోమంటున్నారు. వీరంతా కోర్టులు, అధికారుల చుట్టూ తిరిగలేక ప్రైవేటు సెటిల్‌మెంట్లతో సరిపెట్టుకుంటున్నారు.

దళారులు లేనిదే పని కాదంతే…

రిజిస్ట్రేషన్ శాఖలో ఏ పని కావాలన్నా దళారులను ఆశ్రయించాల్సిందే. వారు లేనిదే ఏ పనీ కాదనటంలో అతిశయోక్తి లేదు. దరఖాస్తు పట్టుకుని నేరుగా వెళ్తే రిజిస్టార్లు కొర్రీలు పెట్టి తిరస్కరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వారే స్వయంగా దళారులకు పని అప్పగిస్తూ సాయంత్రం కాగానే వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ శాఖను గాఢిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments