Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

జలిగామలో విషాదచాయాలు

Brother And Sister Dies With ILL In Siddipet District

సిద్దిపేట: అస్వస్థతకు గురయిన అక్కాతమ్ముళ్లు గంట వ్యవధిలోనే మృతి  చెందిన విషాద సంఘటన  జిల్లాలోని  గజ్వేల్ మండలం జలిగామ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పల స్వామి,పద్మ దంపతులకు సోనీ, ప్రదీప్ అనే ఇద్దరు పిల్లలున్నారు. మూడు రోజుల కిందట ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.ఈ రోజు ఉదయం వారిని గజ్వేల్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో అక్కాతమ్ముడు గంట వ్యవధిలో మృతి  చెందారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Comments

comments