Home తాజా వార్తలు తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య…

తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య…

Brother kill his own elder brother in miyapur
మియాపూర్ : కుటుంబ కలహాలతో సొంత అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సిఐ తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ మయూరినగర్ సుభాష్‌చంద్రబోస్ నగర్‌లో లక్ష్మణ్‌ కుటుంబం నివాసముంటున్నారు. లక్ష్మణ్‌కు ఇద్దరు కొడుకులు రామ్‌దాస్ (40), రవీందర్‌లు ఉన్నారు. రామ్‌దాస్ పెళ్ళి చేసుకొని కుటుంబంతో కూలీ పనులు చేసుకుంటూ నడిగడ్డతాండలో నివాసముంటున్నాడు. పి.రామ్‌దాస్ అతని భార్యతో డబ్బుల కోసం రోజు మద్యం సేవించి గొడవ పడేవారు. తరచుగా గొడవలు పడుతూ ఉండడంతో తన తండ్రి లక్ష్మణ్ ఇంటికి వచ్చి నివాసముంటు, మరల డబ్బుల విషయంలో గొడవ పడి రామదాస్ తన భార్యను కొడుతున్నాడు. ఆమె వెంటనే పిల్లలతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దీంతో ఆగకుండా రామ్‌దాస్ తండ్రి లక్ష్మణ్ అప్పుల కోసం తన ఇళ్ళును అమ్మకానికి పెట్టాడు. రూ.15లక్షలకు ఇళ్ళు బేరం కాగా అడ్వాన్స్ తీసుకొని 4 లక్షలు లక్ష్మణ్ అప్పులు కట్టాడు.

దీంతో రామ్‌దాస్ తనకు మిగితా డబ్బులు కావాలని తరచుగా తండ్రితో గొడవ పడుతున్నాడు. సోమవారం డబ్బులు ఇవ్వండి లేకుంటే అందరిని చంపేస్తానని బెదిరించాడు. తన తమ్ముడు అయిన రవీందర్ అన్న రామ్‌దాస్ తనను కూడా చంపేస్తాడని బయపడి అతని స్నేహితుడైన సాయి అక్టోబర్ 7వ తేదిన కలిసి రామ్‌దాస్‌ను హతమార్చాలని మాట్లాడుకున్నారు. ఆదివారం సాయంత్రం అన్నతో కలిసి రవీందర్ అతని స్నేహితుడు మద్యం సేవించి అనంతరం రాత్రి 11.30 నిమిషాలకు ఇంటికి చేరుకున్నారు. రామ్‌దాస్ నిద్రమత్తులోకి జారుకోగానే రవీందర్, సాయిలు కలిసి చీరతో కాళ్ళు, చేతులు కట్టేసి దిండుతో మోహంపై కప్పి చాకుతో హత్య చేశారు. హత్య చేసిన అనంతరం రవీందర్ మియాపూర్ పోలీసుల వెదుట లొంగిపోయాడు. దీంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రవీందర్, సాయిల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తరువాత కోర్టులో హజరు పరిచారు.

సిఐ వెంకటేష్