Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

భూ వివాదంలో చిన్నాన్నలను నరికి చంపిన అన్నదమ్ములు

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం విషాదం

                        Murder

ఇల్లంతకుంట: భూ వివాదంలో చిన్నా న్నలనే నరికి చంపిన దారుణమైన ఘటన రాజన్న సిరిసి ల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గురువారం మధ్యా హ్నం విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. నర్సక్కపేట గ్రామానికి చెందిన కొంకటి రాజయ్య, కొంకటి కనుక య్య(56), కొంకటి లింగయ్య(64)లు అన్నదమ్ములు.  భూమి విషయమై గత పది సంత్సరాలుగా కొంకటి లిం గయ్య, కనుకయ్య, రాజయ్య మధ్య వివాదం నెలకొంది. రాజయ్య గతంలోనే మృతి చెందాడు. అయితే అతడి కు మారులు కొంకటి అనిల్, కొంకటి అరుణ్ ఇద్దరు కలసి చిన్నాన్నాలైన కనుకయ్య, లింగయ్యను ఇబ్బంది పెడుతు న్నారు. ఈ క్రమంలో అనిల్, అరుణ్  కలసి వ్యవసాయ బావిలో కట్టెలను, రాళ్లను వేసి ధ్వంసం చేశారు. ఈ వి షయమై కనుకయ్య, లింగయ్యలు కలసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో మరింత కోపం పెంచుకున్న అ నిల్, అరుణ్ వారిపై కక్ష కట్టారు. గ్రామంలో అందరూ భక్తి శ్రధ్దలతో పండుగను జరుపుకుంటుండగా కొంకటి కనుకయ్య, లింగయ్య పొలం దున్నేందుకు వెళ్లారు. ఇదే అదునుగా చూసిన అనిల్, అరుణ్‌లు వీరితో గోడవ పడ్డా రు. దీంతో మాటమాటా పెరిగింది. తీవ్ర స్థాయిలో ఘర్ష ణ చోటు చేసుకుంది. అనిల్, అరుణ్‌లు ఇద్దరు కలసి కనుకయ్య, లింగయ్యలను విచక్షణ రహితంగా కొట్టి చం పారు.

గొడవను నివారించేందుకు అడ్డుగా వచ్చిన కనుక య్య భార్య భారతవ్వను కూడా చేతులు, కాళ్లు నరికి వేశారు. ఆలస్యంగా  విషయం గ్రామస్థులకు తెలవడంతో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రా ణాపాయ స్థితిలో ఉన్న భారతవ్వను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన అనిల్, అ రుణ్‌లు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.  సంఘటనా స్థలానికి  వేములావాడ డిఎస్‌పి ఎ. చంద్రశేఖర్, సిరిసిల్ల రూరల్ సిఐ శ్రీధర్, ఎస్‌ఐ పాకాల లకా్ష్మరెడ్డి, ము స్తాబాద్ ఎస్ ప్రవీణ్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృ తుడు కనుకయ్యకు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు అరుణ(18), అపర్ణ(17), కుమారుడు అభినవ్(10) , మృతుడు లింగయ్యకు భార్య ఎల్లవ్వ, కుమారుడు ప్ర శాంత్(28)లు ఉన్నారు.

Comments

comments