Home మంచిర్యాల వదినపై బ్లేడ్‌తో దాడి చేసిన మరిది

వదినపై బ్లేడ్‌తో దాడి చేసిన మరిది

 

brotherinlaw Attacked with blade on the sisterinlaw

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం ఓల్డ్ కాలనీ చౌరస్తా వద్ద తన వదినపై ఓ మరిది బ్లేడ్‌తో దాడి చేసి గాయపర్చిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పట్టణ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కథనం ప్రకారం… విజయ బస్తీ సమీపంలో నివాసముండే రమేష్ సునీత దంపతుల మధ్య గత కొంత కాలం నుండి గొడవలు జరుగున్నాయని ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సునీత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి గొడవ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిపారు. ఇంటికి వెళుతున్న క్రమంలో ఓల్డ్ కాలనీ చౌరస్తా వద్ద ఆమె మరిది అయిన రాజు అలియాజ్ రాజన్న వదినను ఆపి మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా బ్లేడ్‌తో సునీత గొంతుపై దాడి చేశారని, ఆమె కేకలు వేయగా, రాజు పరారయ్యాడని ఎస్సై వివరించారు. వెంటనే సునీతను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు. అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు అనుమానాలు వస్తున్నాయాన్ని  పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాజన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.